సామ్ ప్లాన్ మములగా లేదుగా..!
సామ్ ప్రస్తుతం నటిస్తున్న శాకుంతలం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలా పేరు మార్చిందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన సమంత అలా పేరు ఎందుకు మార్చాను అనే దానిపై అయితే పూర్తి వివరణ అయితే ఇవ్వలేదు కానీ తాను కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నది. ఇప్పటి దాక విరామం లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చాను.
ఇకమీదట అయిన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్న అని సమాధానం చెప్పింది. సామ్ చెప్పిన విషయం పట్ల రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఒక పక్క సినిమాలు లేక ఏడాదిన్నర పాటు ఇంట్లోనే అందరు ఫ్యామిలీతో ఉన్న విషయం మనకి తెలిసిందే. మళ్ళీ కొత్తగా సామ్ ఏంటి ఇలా అంటుంది అన్న ప్రశ్న అందరిలో మెదులుతుంది. ఒకవేళ సమంత ఏమైనా గుడ్ న్యూస్ చెప్పబోతుందా.అందుకే విరామం తీసుకోనున్నట్లు చెప్తుందా అనే ఆలోచన అందరిలో ఉంది. లేదంతె సోషల్ ఖాతాలో ఎస్ అనే పేరుకు ఈ నిర్ణయానికి ఎమన్నా రిలేషన్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటికీ సమంతనే సమాధానం చెప్పాలి.. లేదంటే ఈ ప్రశ్నలకు జవాబులు దొరకడం కష్టం.