ఎప్పుడూ అన్నీ విప్పి చూపించే సినిమాలు చేయలేదు...

VAMSI
సినిమా రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ మనకు తెలియకుండా చాలానే జరుగుతుంటాయి. అందరూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలి స్థిరపడాలని అనుకుంటారు తప్ప, వెళ్లే ముందు నేను ఖచ్చితంగా హీరోనే అవ్వాలి, లేదా అమ్మాయి అయితే హీరోయిన్ అవ్వాలి. ఇలాంటి పాత్రలనే పోషించాలి అని ఎవ్వరూ హద్దులు పెట్టుకోరు. కొత్త కాబట్టి తన నటనకు అవకాశం ఎక్కువగా ఉండే ఏ పాత్రనైనా చేయడానికి ఇష్టపడుతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎంతోమంది యువకుల మనసులతో చెలగాటం ఆదుకున్న ఒక మలయాళ స్టార్ యాక్ట్రెస్ షకీలా గురించి ప్రత్యేకించి పరిచయం అయితే అక్కర్లేదు. ఈమె గురించి చదువుకునే హై స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. ఈమె తన నటనా జీవితంలో ఎక్కువ శతం బి గ్రేడ్ మూవీస్ నే చేసింది.

ఈ సినిమాలలో సెమి న్యూడ్ గా కనిపించడం ఇతరత్రా సన్నివేశాలతో కథానుగుణంగా తన పరిధిమేరకు చేస్తూ వచ్చింది. అయితే ఈ విషయాన్ని సరిగా అర్ధం చేసుకుని యువ మూక షకీలాకు పోర్న్ స్టార్ అనే తోకను అతికించేశారు. అయితే ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగితే...నిర్దాక్షిణ్యంగా ఆ మాటను ఖండించింది. ఎవరు చెప్పారండీ నేను పోర్న్ స్టార్ అని, పోర్న్ కు నేను చేసే సినిమాలలో ఉండే దానికి తేడా తెలియదా ? అది కూడా తెలియని వారెవ్వరో వాగే మాటలను నేను పట్టించుకోనని కొట్టిపారేసింది. అంతే కాకుండా ఈ పాత్రలు ఎలా వచ్చాయో తెలియచేసింది. నేను ఎవ్వరినీ ఈ పాత్రా ఇమ్మని అడిగింది లేదు. ఆ పాత్రల కోసం వారు చెప్పింది చేసిందీ లేదు.

నా మొదటి సినిమాలో నా నటన నచ్చిన వారు ఆ తర్వాత అదే రకమైన సినిమాలతో నన్ను అప్రోచ్  అయ్యారు, నేను కూడా ఒప్పుకున్నాను. ఎప్పుడూ కూడా నేనేంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నాను అనే ఫీలింగ్ కలగలేదు. ఎందుకంటే ఇవి పోర్న్ మూవీస్ కాదు. నా సినిమాలలో నేను విప్పి చూపించలేదు. అలాంటివి ఎప్పడూడూ చేయను కూడా అనే ఖరాఖండీగా చెప్పేసింది. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా నన్ను పోర్న్ స్టార్ అని అనుకోవడం మానేస్తారునై అనుకుంటున్నాను అని ముగించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: