సినిమా అనేది ప్రేక్షకులకు ఎంత వినోదాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఒకప్పుడు సినిమా హిట్ అవ్వడం అంటే ఇన్ని రోజులు ఆడిందని లెక్క గట్టేవాళ్ళు. సినిమా 50 రోజులు ఆడితే హిట్ అని 100 రోజులు ఆడితే సూపర్ హిట్ అని 150 రోజులు ఆడితే బ్లాక్ బస్టర్ హిట్ అని ఇక 200 రోజులు కు పైగా ఆడితే ఇండస్ట్రీ హిట్ అని ఆ చిత్ర నిర్మాతలు అలాగే ఆ హీరో ఫ్యాన్స్ చెప్పుకునేవారు. ఇక ఆ తరువాత ఎక్కువ రోజులు ఎన్ని సెంటర్ లలో ఆడిందో అనేది కూడా రికార్డులుగా చెప్పుకునేవారు. ఇక ఆ తరువాత కలెక్షన్స్ గురించి రికార్డులుగా పరిగణించుకోవడం స్టార్ట్ చేశారు. మా హీరో సినిమా ఇన్ని కోట్ల వసూళ్లు కొల్లగొట్టిందని చెప్పుకునేవారు. ఇక ఆ తరువాత ఓపెనింగ్స్ ఫస్ట్ డే సెకండ్ డే వసూళ్ళని రికార్డులుగా చెప్పుకొని మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని ఫ్యాన్స్ చెప్పుకునేవారు.ఇక క్రమ క్రమంగా ఇలా సాగుతూ వుంది. ఇక సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ముఖ్యంగా యూ ట్యూబ్ రికార్డ్స్ గురించి ఫ్యాన్స్ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
ముఖ్యంగా తమ హీరోల సినిమాల టీజర్ల, ట్రైలర్ల విషయంలో ఇలాంటి రికార్డుల గురించి ఫ్యాన్స్ మాట్లాడుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయాయి. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ లో బాగా ఎక్కువైపోయింది. టీజర్ ల పోటీలో మా హీరో ముందుగా ఎక్కువ లైక్స్, వ్యూస్ అందుకున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.అయితే కొన్ని సినిమాల మేకర్స్ అయితే ఈ రికార్డుల కోసం యాడ్స్ ని పెట్టుకుంటున్నారు. ఇందువల్ల ఆ టీజర్ కి ఎక్కువ వ్యూస్ నమోదవుతున్నాయి. ఇక వాటిని ఫ్యాన్స్ ఆ చిత్ర నిర్మాతలు రికార్డులుగా చెప్పుకుంటున్నారు.ఇక తెలుగులో కూడా ఇలాంటి రికార్డులు సృష్టించిన సినిమాలు వున్నాయి. ఒక్క సర్కారు వారి పాట, అఖండ సినిమాల టీజర్ లు మినహా మిగతా సినిమాల అన్ని కూడా తమ సినిమాల టీజర్ ఇంకా ట్రైలర్ వ్యూస్ కోసం ఆ మూవీ మేకర్స్ యాడ్స్ పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం వల్ల వ్యూస్ బాగా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు. కాని యాడ్స్ తో ఇలా టీజర్, ట్రైలర్ రికార్డ్స్ నమోదవ్వడం అనేది గొప్ప కాదని ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలి.ఏ సినిమా టీజర్ అయితే యాడ్స్ లేకుండా అధిక వ్యూస్, లైక్స్ రాబడుతుందో అది నిజమైన రికార్డు సృష్టించినట్లు.