అనుష్క ను తన ఫ్రెండ్స్ ఎలా పిలుస్తారో తెలుసా ?
తను ఇప్పటి వరకు నటించిన సినిమాలలో నటనే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. గ్లామర్ షో కి దూరంగా ఉండే కొద్ది మంది హీరోయిన్ లలో అనుష్క శెట్టి ఒకరు కావడం విశేషం. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. కేవలం అనుష్క కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈమె సహజమైన నటన, స్వఛ్చమైన మనసు కారణంగా ఎంతో మంది మనసులను గెలుచుకుంది. అనుష్క వ్యక్తిగత జీవితంలో చాలా మందికి తెలియని ఒక్క విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
ఈమెను తన స్నేహితులు అంతా ముద్దుగా టొమ్ములు అని పిలుచుకుంటారట... తన స్నేహితులను చాలా ఇసాను కొన్ని ఇంటర్వ్యూల్లో అనుష్క తెలిపారు. బెంగళూరు లోని మౌంట్ కార్మెల్ కాలేజ్ నుండి బి సి ఏ పట్టా తీసుకున్నారు. తను పుట్టింది బెంగళూరు లోనే అయిన తెలుగు ప్రేక్షకులు అంటే చాలా ఇష్టమట. ఈమె ప్రస్తుతం నిశ్శబ్దం తరువాత మరే సినిమా అధికారికంగా ప్రకటించలేదు. ఈ మధ్య యువ హీరో నవీన్ తో సినిమా అని పలు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వారాలు అవి గాసిప్ లు గానే మిగిలిపోయాయి. మరి తొందర్లోనే ఈమె సినిమా గురించి అప్ డేట్ వస్తుందా చూడాలి.