ఆ హీరో ఇంటి నుంచి మరో వారసులు.. ఎవరంటే..?

Suma Kallamadi
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోలు, ప్రొడ్యూసర్స్ కుమారులు వారసులుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపుగా డజన్ మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చారు. కాగా, హీరో కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం కామన్ అయిపోయిన తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 



మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నది నిహారిక. ఈ క్రమంలో మరో స్టార్ హీరో కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అతనెవరంటే.. ‘వంద’కు పైగా చిత్రాల్లో నటించిన హీరో శ్రీకాంత్ కూతురు మేధ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నదట. ఇప్పటికే భరత నాట్యం నేర్చుకున్న మేధ వెండితెరపై కనిపించేందుకు సిద్ధంగా ఉంది. ఇకపోతే శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆల్రెడీ టాలీవుడ్ కింగ్ నాగార్జునతో ఓ సినిమా చేసిన రోషన్ ప్రస్తుతం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘పెళ్లి సందడి’ ఫిల్మ్‌లో నటిస్తున్నాడు. ఇదే చిత్రం ద్వారా రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. మేధ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె కాలేజ్‌లో జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా రాణిస్తోంది.


 

చదువు పూర్తయిన తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తున్నది. అయితే, మంచి డైరెక్టర్, ప్రొడక్షన్ హౌజ్ నుంచి అవకాశం వస్తే డెఫినిట్ గా ఎంట్రీ ఉండబోతున్నదనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మేధ ఇప్పటికే టాలీవుడ్ స్వీటీ అనుష్క ‘రుద్రమదేవి’ సినిమాలో బాలనటిగా కనిపించింది. ఇకపోతే శ్రీకాంత్ హీరోగా ఉన్నప్పుడే తన సినిమాల్లో నాయికగా నటించిన ఊహను ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఊహ రూపంతోనే మేధ కూడా ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి నేటితరానికి ఈజీగా కనెక్టవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కూతురి ఎంట్రీ గురించి హీరో శ్రీకాంత్ నుంచి ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: