పవన్ ఫ్యాన్స్ కి బండ్లన్న కానుక.. మామూలుగా లేదుగా..!!
బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన కామెంట్స్ ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ విషయం అటుంచితే.. పవన్ హీరోగా నటించిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' సినిమా అటు పవన్ కి ఇటు ఆయన అభిమానులకి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడెప్పుడో పవన్ నటించిన ఖుషీ సినిమాకి గబ్బర్ సింగ్ సినిమాకి మధ్యలో పవన్ నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు.అలాంటి సమయంలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక గబ్బర్ సింగ్ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించగా, హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు.
ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ అభిమాని కావడంతో ఫ్యాన్స్ పవన్ ని ఎలా చూడాలని అనుకున్నారో సినిమాలో అదే విధంగా చూపించాడు దర్శకుడు.ఇక తాజాగా పవన్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాని ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో ప్రదర్శిస్తామని వెల్లడించారు బండ్ల గణేష్.ఈ క్రమంలో ఫ్యాన్స్ కి తెలియజేస్తూ.. దయచేసి మీరందరూ థియేటర్ బుక్ చేసుకోవాలని ఫ్యాన్స్ కి సూచించారు.ఇక గబ్బర్ సింగ్ సినిమా ప్రదర్శనకు అనుమతులు కూడా రావడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఇక పవన్ పై ఉన్న ఎనలేని అభిమానం వల్లే బండ్ల గణేష్ ఈ పని చేస్తుండటం గమనార్హం.ఇక పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకోవడానికి వచ్చిన ప్రతీ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతున్నాడు బండ్ల గణేష్. సో మొత్తానికి మన బండ్లన్న.. పవన్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాతో ఫ్యాన్స్ కి మాంచి ట్రీట్ ఇస్తున్నాడన్నమాట...!!