జబర్దస్త్ 350 ఎపిసోడ్.. మామూలుగా ప్లాన్ చేయలేదుగా?

praveen
జబర్దస్త్..  ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిని కాసేపు ఆగి తనివితీరా నవ్వుకునేలా చేస్తుంది ఈ కార్యక్రమం.  ఎంత ఒత్తిడిలో ఉన్న కాసేపు ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ చూశారు అంటే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు.  ఇలా ప్రస్తుతం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతూ బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్.  ప్రస్తుతం నవ్వులకు చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ కార్యక్రమం.  ఎన్నో ఏళ్ల నుంచి తిరుగులేని కామెడీ షో గా కొనసాగుతోంది.



 అయితే జబర్దస్త్ అనే కార్యక్రమం ప్రతి వారం అటు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి రాణించాలి అనుకున్న ఎంతో మంది కమెడియన్స్ కు ఒక మంచి ఫ్లాట్ఫామ్ గా కూడా మారిపోయింది.  ప్రస్తుతం ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యారు అని చెప్పాలి. అయితే ఇక ప్రేక్షకులను మరింత నవ్వించడానికి జబర్దస్త్ కార్యక్రమానికి కొనసాగింపుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు.  ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రతి శుక్రవారం ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.



 అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చిన తర్వాత అంతగా పాపులారిటీ సాధించలేదు అని అనుకున్నారు అందరు. కానీ ప్రస్తుతం జబర్దస్త్ తో పాటే ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. చూస్తూ చూస్తుండగానే ఏకంగా 350 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది ఎక్స్ ట్రా జబర్దస్త్.  బుల్లితెరపై ఒక షో ఇంత సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక ఇటీవల 350 ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది.  ఇక ఈ 350 ఎపిసోడ్లో జబర్దస్త్ కమెడియన్స్ సరికొత్త స్కిట్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  ఇటీవలే విడుదలైన ప్రోమోను చూస్తుంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ 350 ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: