తెలుగు సినిమాని ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన నాగార్జున...

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండియాలో వున్న అందమైన ఇంకా ప్రతిభ గల నటులలో కింగ్ నాగార్జున కూడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా ఇండస్ట్రీ కి పరిచయమైన నాగ్ మొదటి సినిమాతోనే తన అందం నటనతో ప్రేక్షకులని కట్టిపడేసాడు. నవ మన్మధుడిగా అమ్మాయిల మనస్సుని దోచి వారి కలల రాకుమారుడిగా ఎన్నటికి కూడా చెరగని ముద్ర వేసుకున్నాడు కింగ్ నాగార్జున.ఒట్టి తన అందంతో మాత్రమే కాదు తన నటనతో కూడా నాగార్జున అనేక అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో క్లాసిక్ చిత్రాలతో ఎంతో గొప్ప నటుడిగా నాగ్ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.80,90 లలో నాగార్జున దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


గీతాంజలి, శివ లాంటి సినిమాలతో ఇండస్ట్రీ గర్వపడే హిట్స్ ని ఇచ్చిన నాగ్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియా హీరోగా రికార్డు సృష్టించాడు. అప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాత్మక సినిమా చెయ్యాలన్న అలాగే మంచి యాక్షన్ సినిమా తీయాలన్న నాగార్జుననే ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకునేవారు దర్శకనిర్మాతలు. ఇక ఆ క్రమంలోనే నాగార్జున తెలుగు నుంచి రక్షకుడు అనే పాన్ ఇండియా సినిమా తీశాడు.భారీ బడ్జెట్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా 1997 లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసింది. ఇలా ఈ సినిమాతో నాగార్జున తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ లోకి తీసుకెళ్లిన హీరోగా నిలిచాడు.కాని దురదృష్టవశాత్తు ఈ సినిమా ప్లాప్ అయింది. అయినా కాని ఈ సినిమాతో నాగార్జున క్రియేట్ చేసిన హైప్, క్రేజ్ అప్పట్లో ఏ హీరో తీసుకురాకపోవడం విశేషం.అప్పట్లోనే ఈ సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిందంటే నాగార్జున స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: