బన్నీనిజంగా రేసు గుర్రమే..!
స్టార్ హీరోలు ఒక సినిమాకి సైన్ చేయాలంటే చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేందుకు పెద్ద కసరత్తులే చేస్తుంటారు. అందుకే సినిమాల మధ్య గ్యాప్ తీసుకుంటారని టాక్. అయితే అల్లు అర్జున్ ఇప్పుడీ ట్రాక్ నుంచి బయటపడుతున్నాడు. వరుస సినిమాలతో కొత్త ట్రాక్‌లోకి వెళ్తున్నాడు. అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే 'అల వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ తర్వాత బన్ని స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సైన్ చేస్తున్నాడు. 'పుష్ప' సెట్స్‌లో ఉండగానే మూడు నాలుగు సినిమాలని లైన్లో పెడుతున్నాడు.
అల్లు అర్జున్ 'పుష్ప' రెండు భాగాలుగా వస్తోంది. సెకండ్ పార్ట్ పూర్తవ్వడానికి మరో ఏడాది పడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ వెంచర్ పూర్తికాకముందే మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివతో ఒక సినిమాకి సైన్ చేశాడు. అలాగే ప్రశాంత్ నీల్‌తో సినిమా కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మరోవైపు తమిళ డైరెక్టర్ మురుగదాస్‌తో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరి ఇంత స్పీడ్‌గా ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తోన్న బన్నీ, ఈ సినిమాలని ఎంత గ్యాప్‌లో విడుదల చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.