అందాల ముద్దుగుమ్మ నభానటేష్
కన్నడ సినిమా 'వజ్రకాయ' తో
సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రజలను పలకరించింది. ఆ తర్వాత
రవితేజ హీరోగా నటించిన 'డిస్కో రాజా'
సినిమా తో మరోసారి
టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ
నభా నటేష్ అందచందాలకు, నటనకు, హావభావాలకు తెలుగు ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా అదే సమయంలో రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో
నభా నటేష్ కు అవకాశం వచ్చింది.
ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద
బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మ కు తెలుగులో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. 'ఇస్మార్ట్ శంకర్'
సినిమా ఇచ్చిన
జోష్ లోనే ఈ హాట్
బ్యూటీ సోలో బ్రతుకే సో బెటర్ , అల్లుడు
అదుర్స్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నభానటేష్ , నితిన్ హీరోగా నటించిన 'మాస్ట్రో' సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా మరి కొద్ది రోజుల్లో ఒక ప్రముఖ 'ఓటిటి' లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న నభానటేష్ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ ఆక్టివిటీస్ ను మరియు తన రోజు చేసే పనులను తన షూటింగ్ అప్డేట్స్ ను సోషల్
మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రకారుకు వేడెకిస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నభానటేష్ నలుపురంగు దుస్తులలో వయ్యారాలను ఒలకబోస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్ లలో చాలామంది
లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.