తెలుగు 'బిగ్ బాస్' సీజన్ ఫైవ్ కు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే హౌస్ సెట్టింగ్ పూర్తికాగా 'షో' ని జనాల్లోకి తీసుకెళ్లాలని మరియు 'షో' పై హైప్ పెంచేందుకు ఇప్పటికే నిర్వాహకులు 'బిగ్ బాస్' కు సంబంధించిన ప్రోమో లను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో లకు జనాల నుండి మంచి స్పందన కూడా లభించింది. బుల్లితెర అభిమానులు ఈ 'షో' ఎప్పుడు ప్రారంభం అవుతుందా..ఎప్పుడు చూద్దామా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మొదటి నుండే ఈ 'షో' పై విభిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 'షో' ను మాత్రం అనుకున్నట్లుగానే సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి మొదలుపెట్టాలనే ఆలోచనలో 'బిగ్ బాస్' నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. 'షో' ప్రసార తేదీ దగ్గరకు రావడంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ ల పేర్లు బయటకు లీక్ అవుతూ ఉన్నాయి.
ఇప్పటికే ఈ 'షో' లో ఇషా చావ్లా, సీరియల్ హీరో మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, మోడల్ జశ్వంత్, షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, నటి శ్వేత, సీరియల్ నటి ప్రియ, జబర్దస్త్ ఫేమ్ ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, లోబో, సీరియల్ హీరో వీజే సన్నీ, యానీ మాస్టర్, కార్తీకదీపం భాగ్య (ఉమా), లహరి రాబోతోన్నట్టు ఓ లిస్ట్ వచ్చింది. పైగా ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ నిఖిల్, ఆట సందీప్ భార్య జ్యోతి వంటి వారు రాబోతున్నట్లుగా టాక్ కూడా నడిచింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం 'బిగ్ బాస్' షో లోకి వచ్చే కంటెస్టెంట్స్ మారిపోయినట్లు గా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఇషా చావ్లా , వర్షిని, నవ్య స్వామి పేర్లు వినిపించడం లేదు. వీరికి బదులుగా మరిన్ని కొత్త పేర్లు వినపడుతున్నాయి. అందులో యూట్యూబర్ సరయు , నటుడు విశ్వ, డ్యాన్స్ మాస్టర్ నటరాజ్, సింగర్ రామచంద్ర వంటి వారి పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ క్యారంటైన్లో ఉన్నారని , మూడవ తేదీ వరకు తమ మొబైల్ ఫోన్స్ తమ దగ్గరే పెట్టుకుంటారు అని , ఆ తర్వాత 'బిగ్ బాస్' నిర్వాహకులకు వాటిని అప్పగిస్తారని, 4వ తేదీన వారు 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్తారు అని, 5వ తారీఖున 'షో' ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జున కూడా హోస్ట్ గా వ్యవహరించడానికి రెడీగా ఉన్నాడు.