అందరి మనసులు గెలిచిన ''జయం''

Veldandi Saikiran
మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. ప్రేమ కథ నేపద్యంలో వచ్చిన సినిమాలు చాలా వరకు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన సినిమానే "జయం". ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. జయం సినిమా  ప్రేమ కథ నేపథ్యంతో పాటు యాక్షన్ ఎంటర్ టైనర్ గా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ జయం సినిమా 2002 అంటే పది సంవత్సరాల కింద విడుదలైంది. ఈ సినిమాను తేజ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నితిన్ మరియు సదా హీరో హీరోయిన్లుగా నటించారు. అలాగే గోపీచంద్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించగా... ఢిల్లీ రాజేశ్వరి, మల్లికార్జున రావు, దువ్వాసి మోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుమన్ శెట్టి, శివ కృష్ణ లాంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 

ఇక ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే... నితిన్ ఓ పేద విద్యార్థి. తండ్రి లేని నితిన్ ఏదో చిన్న పార్టీ పని చేసుకుంటూ తన తల్లిని మరియు తన చదువును కొనసాగిస్తుంటాడు. రికార్డు హీరోయిన్ సదా.. జమీందారు కూతురు. నితిన్ మరియు సదా ఒకే కాలేజీ లో చదువుతారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే  ఈ తరుణంలోనే... సదా పై గోపీచంద్ కూడా మనసు పారేసుకుంటాడు. ఎలాగైనా సదా అను పెళ్లాడాలని నిర్ణయం తీసుకుంటాడు. అంతేకాదు సదా తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి కూడా కుదుర్చుకుంటాడు గోపీచంద్. దీంతో... నితిన్ మరియు సదా ఇంట్లో నుంచి లేచి పోతారు. ఇక వీరి ప్రేమ వ్యవహారానికి నితిన్ స్నేహితులు చాలా సహాయం చేస్తారు.

ఇక అటు లేచిపోయిన నితిన్ మరియు సదా కోసం గోపీచంద్ రౌడీలను పంపిస్తాడు. ఇక సినిమా సెకండాఫ్ పూర్తిగా చేజింగ్ నేపథ్యంలోనే కొనసాగుతుంది. చివరికి గోపీచంద్ కు బుద్ధి చెప్పి సదాను పెళ్ళాడతాడు నితిన్. ఈ లవ్ స్టోరీని దర్శకుడు తేజ చాలా చక్కగా రూపొందించాడు. ఓ పల్లెటూరి వాతావరణంలో.. ఇద్దరు ప్రేమికులు పడే కష్టాలు...  మరియు వారు ఎలా ఒకటవుతారు అనే దానిపై స్టోరీని చాలా చక్కగా అల్లాడు తేజ. మధ్య మధ్యలో కామెడీ సీన్స్ పెట్టి ప్రేక్షకులను అలరించాడు. ఇక ఈ సినిమా నితిన్, సదా మరియు గోపీచంద్ లకు మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా హీరో నితిన్ సినిమా కెరీర్ కు ఇది టర్నింగ్ పాయింట్ అయింది. రికార్డు జయం సినిమా నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: