ఆ ఒక్క స్కిట్ తో ఏడిపించారుగా భయ్యా.. జబర్దస్త్ ప్రోమో వైరల్?
ఎంత సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అంటే ఏకంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం 350 ఎపిసోడ్ పూర్తి చేసుకుంది అని చెప్పాలి. బుల్లితెరపై ఒక వారంతపు షో 350 ఎపిసోడ్ పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇటీవలే 350 వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఇక ఈ ప్రోమో ఎప్పటిలాగానే సందడి సందడిగా మారిపోయింది. 350 ఎపిసోడ్ సందర్భంగా ఒక స్పెషల్ స్కిట్ చేశారు జబర్దస్త్ కమెడియన్స్. ఈ క్రమంలోనే జబర్దస్త్ కు రాకముందు జబర్దస్త్ కమెడియన్స్ ఎలాంటి కష్టాలు పడ్డారు అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు.
ఈ క్రమంలోనే జబర్దస్త్ నరేష్ ఈ షో కి రాకముందు ఇక తాను హైట్ పెరగకపోవడం వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడు... ఇక చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎదురయ్యే అవమానాలు అన్ని విషయాలను చూపించారు. అంతే కాకుండా సుడిగాలి సుధీర్ గెటప్ శీను కూడా జబర్దస్త్ కి రాకముందు ఎలాంటి కష్టాలు పడ్డారు అన్న విషయాన్ని చూపించారు. ఏకంగా ఓ వైపు రోజుల తరబడి తినకుండా ఉండి కడుపు మాడుతున్నప్పటికీ అవకాశాలకోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఈ స్టేజ్ లోకి వచ్చారు అన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టించారు. ప్రస్తుతం ఈ స్కిట్ కాస్త సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది