అబ్బా .... టాపిక్ మార్చండయ్యా బాబు .... ??
అయితే పెళ్ళికి ముందు హీరోయిన్ గా ఎన్నో భారీ సినిమాల్లో నటించి ఎందరో అభిమానుల మనసులను గెలుచుకోవడంతో పాటు టాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నారు సమంత. ఆపై ఆమె తెలుగు సహా పలు ఇతర భాషల్లో కూడా నటించి మంచి సక్సెస్ లు ఆమె సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు చైతన్య కూడా తన కెరీర్ పరంగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి నటుడిగా పలు సక్సెస్ లు అందుకుని ప్రేక్షకాభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. ఇక వీరి వివాహం తరువాత సమంత ఒకింత జాగ్రత్తగా కెరీర్ ని ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత, కొన్నాళ్ల క్రితం సడన్ గా తన మీడియా అకౌంట్స్ లో పేరులో నుండి అక్కినేనిని తొలగించారు.
దానితో ఈ యువ జంట ఫ్యామిలీ లో కలతలు రేగాయని, అందుకే సమంత అక్కినేని పేరుని తొలగించారని, అలానే త్వరలో ఈ జంట విడిపోనుందని పలు పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో, తాను స్పందించదల్చుకున్న విషయాలపైనే మాత్రమే సమాధానం చెప్తాను అంటూ సమంత ఈ విషయమై తన సన్నిహితుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. అయితే వారిద్దరి మధ్య ఏమి జరిగిందనేది వారి వ్యక్తిగతం అని, అసలు వారి వ్యక్తిగత విషయాలపై అమితంగా శ్రద్ధ చూపించడం సరైనది కాదని కొందరు అంటుండగా, అబ్బా దయచేసి ఇక ఆ టాపిక్ మార్చండయ్యా అంటూ పలువురు సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి మాదిరిగా తమ హీరోయిన్ ని కూడా వ్యక్తిగత జీవితం ఉందని, దానికి ఇబ్బంది కలిగించేలా ఎవరూ వ్యవహరించవద్దు అని, అసలు వారి ఫ్యామిలీ లో ఏమి జరిగిందో ఎవరికీ తెలియదని, అందుకే అందరూ ఈ విషయాన్ని వదిలేయాలని వారు కోరుతున్నారు.