దగ్గుబాటి హీరోల సినిమాల రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేనా..??
అయితే మొదట్లో ఆ వార్తలను ఖండించినా సురేష్ బాబు మెల్లమెల్లగా ఓటీటీ వైపు అడుగులు వేశాడు. ఇక అమెజాన్ ప్రైమ్ వేదికగా 'నారప్ప' చిత్రాన్ని విడుదల చేశాడు. ఇక థియేటర్ల ఓనర్ ఇలా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం ఏంటని సురేష్ బాబుని అందరూ ప్రశ్నించగా.. సురేష్ బాబు ఈ విధంగా స్పదించారు. ఇక నారప్ప' సినిమాని వేరే నిర్మాతతో కలిసి నిర్మించామని.. అందుకే నిర్మాత మేలుకోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అలాగే 'దృశ్యం 2' 'విరాటపర్వం' చిత్రాలు కూడా ఇతర నిర్మాతల భాగస్వామ్యంతో నిర్మించారు. ఇక అందుకే వీలైనంత త్వరగా వాటిని కూడా ఓటీటీలోకి తీసుకొస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ రెండు సినిమాల విషయాలలో సురేష్ బాబు మౌనంగా ఉంటున్నారు. ఇక టక్ జగదీష్' 'మాస్ట్రో' వంటి చిత్రాలు ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయంటూ.. కంటెంట్ ని ఎక్కువ రోజులు దాచి పెట్టలేం అంటూ ఓటిటి బాటలోకి వెళ్లాయి. కాగా.. థియేటర్ల మనుగడ గురించి ఆలోచించకపోతే వాళ్ళు చెప్పింది వాస్తవమే కదా. ఇక సురేష్ బాబు కూడా వాళ్ళలాగే ఆలోచించి ధైర్యం చేసి మిగతా రెండు చిత్రాలను ఓటీటీలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని భావిస్తున్నారు. ఈ విషయంపై సురేష్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.