ఓటీటీకి 'మెగా' సాయం .. ఎందుకంటే.. ?
ఇప్పటికే చాలా వరకు సూపర్ హిట్ మూవీలను అలాగే వెబ్ సిరీస్ లతో పాటుగా చాలా వరకు ఇతర భాషల హీరోలకు చెందిన సినిమాలను తెలుగు ఆడియన్స్ కి అందిస్తోంది అరవింద్ సంస్థ. కాగా ఇప్పుడు అల్లు అరవింద్ సమక్షంలో నడుస్తున్న ఆహా ఓటీటీ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో సత్తా చాటే విధంగా అలాగే మిగతా ఓటీటీల సంస్థలకు ధీటుగా నిలిపేందుకు ఆయన ట్రై చేస్తున్నారు. ఇక స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ ఈ మేరకు అన్ని విధాలుగా తనవంతు సపోర్ట్ అందిస్తున్నారు.
కాగా ఇప్పటి వరకు అన్ని విధాలుగా అన్నీ తానై సక్సెస్ ఫుల్ గా నడిస్తున్నా కూడా ఇంకా బలంగా సంస్థను రెడీ చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారంట. ఇందుకోసం సంస్తను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా ఓటీటీ కోసం మెగాస్టార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
చిరంజీవికి కాన్సెప్ట్ నచ్చితే చాలని కచ్చితంగా ఆయన ఓకే అంటారని అల్లు అరవింద్ కూడా అప్పట్లో మీడియా వేదికగా వివరించారు. ఇక ఇప్పటికే సమంత చేస్తున్న సామ్ జామ్ టాక్ షో కు మెగాస్టార్ చిరంజీవి వచ్చి అలరించారు. ఇక ఇప్పుడు చిరంజీవితో ఏదైనా స్పెషల్ షో లేదంటే ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు మెగా ప్రొడ్యూసర్ అరవింద్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ఆహాకు ఇక తిరుగండదనే చెప్పాలి.