రణ్‌వీర్, అలియా కాంబో మళ్లీ రిపీట్ అవుతుందా ...?

Suma Kallamadi
ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘గల్లీభాయ్’. బాక్సాఫీసు వద్ద సత్తా చాటిన ఈ సూపర్ హిట్ చిత్రం పలు అవార్డులు కూడా అందుకుంది. ఇకపోతే రణ్‌వీర్, ఆలియా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపైనా ప్రశంసల వర్షం కురిసింది. కాగా, ఈ జోడీ మళ్లీ రిపీట్ అవబోతున్నదని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కరణ్ జోహార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. అయితే, ఆ సినిమా కొవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. కాగా, ప్రస్తుతం వీరిరువురు జంటగా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నారని సమాచారం.

సంజయ్ డైరెక్షన్‌లో ఆలియా ‘గంగుభాయి కతియావాడి’ ఫిల్మ్ చేస్తోంది. ముంబైలోని కామటిపురా రాణి ఆధారంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్‌లో ఆలియా భట్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. కాగా, ఈ చిత్రం విడుదల కాకముందే సంజయ్ మరో చిత్రంలో ఆలియా హీరోయిన్‌గా ఫైనల్ అయిపోయిందట. ఇందులో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా కనిపించనుందని బీ టౌన్ టాక్. ‘బైజు బావ్రా’ అనే టైటిల్‌తో సంజయ్ లీలా భన్సాలీ ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. పీరియాడిక్ డ్రామాగా భిన్నమైన కాన్సెప్ట్‌తో ఆ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. తెరపై జంటగా మరోసారి ఈ చిత్రం ద్వారా రణ్‌వీర్, ఆలియా మెరవనున్నారు. రణ్‌వీర్ ప్రస్తుతం ‘సూర్యవంశీ, 83, జయేశ్ భాయి జోర్దార్, సర్కస్, రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘83’ ఫిల్మ్ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్  కాగా ఇందులో రణ్‌వీర్ సరసన హీరోయిన్‌గా ఆయన భార్య దీపికా పదుకునే నటిస్తోంది. ఈ చిత్రంపై ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.  ఇకపోతే ఆలియా భట్ నటించిన ‘గంగుబాయి కతియావాడి’ చిత్రం త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తుండగా, ఆమె ‘సీత’గా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ కోసం సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: