సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ లో అంత ఘోరం జరిగిందా...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఎన్నో చిత్రాలు నిర్మిస్తూ ఉన్నారని సమాచారం.అలా నిర్మిస్తున్న వాటిలో షూటింగ్ సమయాలలో ఏదో ఒక చిన్న తప్పు జరగడం వల్ల భారీ ప్రమాదమే జరుగుతూ ఉంటుందని తెలుస్తుంది.అలా అప్పట్లో కూడా ఒక పెద్ద ప్రమాదం జరిగిందని సమాచారం.అది స్టార్ హీరోల సినిమాకి ఈ విధంగా జరిగిందని సమాచారం.ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

వైజయంతి బ్యానర్ పై రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా అడవి సింహాలు. ఈ సినిమాలో కృష్ణ -శ్రీదేవి మరియు కృష్ణంరాజు-జయప్రద ఇలా రెండు జంటలుగా నటించారని సమాచారం.ఇక ఈ సినిమాలోని పాటలు వైజాగ్ బీచ్ లో జరిగాయని సమాచారం.అలా జరిగేటప్పుడు ఒక దుర్ఘటన సంఘటన చోటు చేసుకుందట.అందులో ఒకరి ప్రాణం పోయిందట. అలాగే అక్కడున్న కొంతమంది పిల్లలకు ప్రాణాపాయం తప్పిందని సమాచారం.

ఆరోజున వైజాగ్ బీచ్ లో కృష్ణ కృష్ణంరాజు శ్రీదేవి జయప్రదలపై పిల్ల నచ్చింది అనే పాటను తీస్తున్నారట.ఆ సమయంలో అక్కడ కొన్ని వందల రంగు రంగుల బెలోలన్ల కు సిలిండర్ గ్యాస్ ఎక్కిస్తూ వున్నారట.ఆ బెలూన్లను అక్కడ ఆ పని చేస్తున్న ఒక వ్యక్తి ని అక్కడ చుట్టుపక్కల ఉండే పిల్లలు చాలా వింతగా చూస్తున్నారని సమాచారం.అలా కొద్దిసేపు తర్వాత అక్కడికి కృష్ణంరాజు జయప్రద వచ్చారంటూ మాటలు వినిపించడంతో అక్కడున్న పిల్లలంతా కృష్ణంరాజు జయప్రద దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారని సమాచారం.


అలా వెళ్లిన ఒక రెండు నిమిషాలకి ఆ బీచ్ లో సిలిండర్ నింపుతున్న వ్యక్తి దగ్గర గ్యాస్ సిలిండర్ పేలిందని సమాచారం.అక్కడ గ్యాస్ నింపుతున్న వ్యక్తి తల తెగి గాలిలో ఎగిరిపోయిందట.ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అందరు షాక్ లో ఉన్నారని సమాచారం.అక్కడ ఉండేటువంటి చిన్న పిల్లలు సైతం వణికిపోయారని సమాచారం.అప్పటిదాకా అక్కడున్న పిల్లలు ఒక్కసారిగా సినీనటుల దగ్గరికి రావడం చేత పెను ప్రమాదం తప్పిందని తెలుస్తుంది.లేదంటే ఎంతో మంది పిల్లల ప్రాణాలు పోగొట్టుకునే వారని సమాచారం.ఏది ఏమైనా ఇలా జరగడంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్త పడ్డారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: