నాని ఫైర్: నా సినిమాను ఎవ్వడూ ఆపలేడు... ?
కట్ చేస్తే కొంతమంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ నానీ సినిమాలను ఇక ముందు ఎవడు రిలీజ్ చేస్తాడు ? ఇక నాని కెరీర్ క్లోజ్? అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేశారు. ఈ మధ్యన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నానీ వీటి గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ఇక్కడ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "సినిమా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఆ సంతోషాన్ని ఇప్పుడు మనము నాలుగు గోడల మధ్యనే చాలా సేఫ్ గా అనుభవిద్దాం అని చెబుతున్నారు. నాని ఆలోచన నచ్చిన వారు జై కొడుతున్నారు, సినిమాను బిజినెస్ లా చూసేవారికి నానీ మాటలు నచ్చడంలేదు. అందుకే అలాంటి వారు నాని సినిమాలను బ్యాన్ చేస్తాం అంటూ మాట్లాడారు. అలాంటి వారికి గురించి నానీ ఏమీ అనలేదు.
వారంతా నా ఫ్యామిలీ లాగానే ఏదో ఆవేశంలో అలా మాట్లాడారు అని మంచిగా మాట్లాడి తన గొప్పతనాన్ని నిరూపించుకున్నారు. ఇక నా సినిమాలు బ్యాన్ చేసే విషయం గురించి మాట్లాడుతూ, 'బయట అంతా పరిస్థితి బాగాలేకుంటే ఎవరో నా సినిమాలను ఆపేదేంటి ? నేనే నా సినిమాలను ఆపేస్తాను. ప్రజలు బాగుంటేనే మనము అంతా బాగుంటాము. లాంటి వారి శ్రేయస్సు కోసం అందరూ సమిష్టిగా ఆలోచించాలని కోరుకున్నారు నాని. సినిమా గురించి మాట్లాడుతూ శివ కథ చెప్పినప్పుడే ఈ సినిమా నాకు నచ్చేసింది. మంచి కుటుంబ విలువలు కలిగి ఉన్న సినిమా. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. రొటీన్ సినిమాల లాగా కాకుండా కొత్తగా ఉంటుంది అని నానీ అన్నారు.