షాకింగ్: హాస్పిటల్ లో ప్రముఖ నటుడి భార్య... ?

VAMSI
సినిమా పరిశ్రమలో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో ఈ మధ్యన మరణించిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇదే బాధతో ఆలోచనతో నిరంతరం ఆయన జ్ఞాపకాలతో బ్రతుకుతున్న దిలీప్ కుమార్ సతీమణి సైరాభాను సైతం ఈ రోజు ఆరోగ్య సమస్య కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈమెకు గత కొంత కాలంగా దీర్ఘ కాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఈమెకు ఒక్కసారిగా బ్లడ్ ప్రెజర్ పెరగడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, సైరాభానును భర్తను చేర్చిన హిందుజా హాస్పిటల్ లోనే చేర్పించారు. అయితే బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండడంతో డాక్టర్స్ కూడా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈమెను ఐసీయూ లో ఉంచి చికిత్సను అందిస్తున్నార్నని బంధువుల ద్వారా తెలిసింది.

కొంత చికిత్స జరిగిన అనంతరం ప్రాణాపాయం లేదని డాక్టర్స్ తేల్చినట్లుగా సమాచారం.  డాక్టర్స్ చెప్పిన సమాచారం ప్రకారం కేవలం ఈమె దిలీప్ కుమార్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుండడం వల్లనే బ్లడ్ ప్రెజర్ సడన్ గా ఎక్కువ అయినట్లు చెప్పారు. అయితే ఈ లోకంలో ఎవ్వరైనా భర్తతో తన జీవితాన్ని గడిపిన తర్వాత ఒక్కసారిగా ఆయనను కోల్పోతే ఆ బాధను మరియు ఆ లోటును ఎవ్వరూ తీర్చలేరు. అందులోనూ వీరిద్దరిదీ ప్రేమ వివాహం కావడం ఒక బలమైన కారణం. దిలీప్ కుమార్ సైరాభాను ల మధ్యన దాదాపు 20 సంవత్సరాల వయసు తేడా ఉంది. అయినా ఎప్పుడూ వీరి బంధానికి వయసు అడ్డు కాలేకపోయింది.

ఇంతకాలం ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఇంత కాలం ఒకరికి ఒకరుగా బ్రతికారు. దేవుడు వీరిద్దరికీ పిల్లలను కలిగించకుండా పెద్ద శిక్ష వేశాడు. ఇప్పుడు తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు కూడా లేకపోవడంతో మరింత దుఃఖానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈమె వీలైనంత తొందరగా కోలుకుని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: