పవన్ కళ్యాణ్ దగ్గర గన్.. అసలు స్టోరీ చెప్పిన పవర్ స్టార్?

praveen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం ఎంతో మంది అభిమానులకు దేవుడిగా మారిపోయిన వ్యక్తి. కేవలం సినిమాలతోనే కాదు ఆయన వ్యక్తిత్వంతో, ఆయన భావజాలంతో కూడా ఎంతో మంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్నాడు పవన్ కళ్యాణ్.  ప్రతి విషయాన్ని కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ..  నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.  సాధారణంగా ప్రతి హీరోకీ కూడా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటే  అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది.



 కానీ అదేంటో గాని పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు కొన్నే.. ఆయన నటించిన సినిమాల్లో విజయం సాధించిన సినిమాలు కూడా చాలా తక్కువే.  కానీ ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  కేవలం మెగా ఫ్యామిలీ అభిమానులే కాదు ఇతర హీరోల అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ నూ ఆరాధిస్తూ ఉంటారు. కాగా నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో  అభిమానులు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.



 ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జీవితం గురించి ఒక ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ దగ్గర ఒక లైసెన్సుడ్ తుపాకీ ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే.  ఈ తుపాకిని అప్పుడప్పుడు బయటకు కూడా తీశాడు పవన్ కళ్యాణ్ .  అయితే  పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న తుపాకీ వెనుక అసలు స్టోరీ మాత్రం చాలామందికి తెలియదు  ఆ స్టోరి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కోపానికి, ఆలోచన తీరికి, ఆయన భావజాలానికి ఉద్యమాల్లోకి వెళ్ళిపోతాడేమో అన్న భయంతో తమ్ముడికి తుపాకీ కావాలని భావించి చిరంజీవి ఒక లైసెన్సుడ్ తుపాకీ ఇచ్చారట. అయితే తన ఆవేదన అన్యాయం మీద కానీ తుపాకీ సొంతం చేసుకోవాలని కాదు అని పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అన్నయ్యకు చెప్పాలనుకున్నారట. అయితే అప్పటివరకు అమ్మాయితో ప్రేమ ఎలా ఉంటుందో తెలియదని కానీ అన్నయ్య తుపాకీ కొనిచ్చిన తర్వాత తుపాకీతో ప్రేమలో పడిపోయాను అంటూ పవన్ కళ్యాన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: