పవన్ రియల్ లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా..?

Suma Kallamadi

వ‌ప‌ర్ స్టార్ పేరులోనే ఓ పవర్ ఉంని చెబుతుంటారు ఆయ‌న అభిమానులు. టాలీవుడ్ లోనే ఆయ‌న పేరు ఒక చ‌రిత్ర అనే చెప్పాలి. ఏ హీరోకు సాధ్యం కానంత అభిమానుల‌ను ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఈ కార‌ణాల‌తోనే ఆయ‌న పవర్ స్టార్ అయ్యారు. ఆయనను అభిమానించే వారికి ఆయ‌న కళ్లల్లో ప్రేమికుడు అలాగే మాటల్లో నాయకుడు గా క‌నిపిస్తుంటారు. ఇక చేతల్లో అయిన అచ్చం శ్రామికుడు అని అంటారు.

అన్న‌య్య మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టినా కూడా త‌న సొంత ఇమేజ్‌తోనే పైకి వ‌చ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న‌కంటూ సినిమాల ప‌రంగా ఓ పేరు అలాగే సొంతంగా అభిమానులను తెచ్చుకున్నారు ప‌వ‌ర్ స్టార్‌. ఇప్ప‌టి త‌రం యువతకు ప‌వ‌ర్ స్టార్ ఒక పెద్ద ఐకాన్ నిలిచారనే చెప్పాలి. మ‌రి అలాంటి ప‌వ‌ర్ స్టార్ గురించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలుసుకోవాల‌ని ఉంటుంది క‌దా.

ఆయ‌నకి చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ పై ఆస‌క్తి ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కార‌ణంగానే ఆయ‌న కరాటే నేర్చుకున్నారు. ఇక ఇందులో కూడా ప‌వ‌ర్ స్టార్ బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకున్నారంటే ఆయ‌న స‌త్తా ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఆయ‌న తన వదిన అయిన సురేఖ ప్రోద్భలంతోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో త‌న కెరీర్‌ను స్టార్ట్ చేశారంట‌. మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ తొలి ప్రేమ. ఇక దీని త‌ర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ల‌ను వ‌రుస‌గా ఖాతాలో వేసుకుని స్టార్ హీరో అయిపోయారు.

ఇక అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు తిరుగు లేకుండా పోయింది. వీటి త‌ర్వాత జల్సా, గబ్బర్ సింగ్ మూవీలు ఆయ‌న కెరీర్‌ను మ‌లుపు తిప్పాయి. ఇక వీటి త‌ర్వాత అత్తారింటికి దారేది మూవీ అయితే ఇండ‌స్ట్రీ రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింద‌నే చెప్పాలి. ఇక రియల్ హీరోగా ఎక్కువ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. తన సినిమా తీసి న‌ష్టాల పాల‌యిన వారికి అనేక సందర్భాల్లో అండగా ఉంటున్నారు ప‌వ‌న్‌. మూవీ స్ స్టార్ ఇండియా సంస్థ రీసెంట్ గా నిర్వహించిన స‌ర్వేలో దేశంలోనే ఎక్కువమంది అభిమానులు ఉన్న నటుడిగా ప‌వ‌న్ ఐదో స్థానంలో నిలిచారంటే ఆయ‌న క్రేజ్ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: