పవన్ కళ్యాణ్ తో చేసి ఈ భామ అంత ఫేమస్ అయిందా?

VAMSI
ఇప్పుటి తరం హీరోయిన్లు అంతా ఒక్క సినిమా చేసి మాయమైపోతున్నారు. ఆ సినిమా హిట్ అయినా లేదా ప్లాప్ అయినా కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇందుకు సమయం కూడా సహకరించాలి. అయితే ఈ హీరోయిన్ లలో ఎవరైనా కూడా స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకోవాలని ఆశపడుతుంటారు. కొంతమంది అయితే ఒక్కసారైనా స్టార్ హీరోలతో నటించాలి, వీరున్న సినిమాలో చిన్న పాత్ర చేసినా చాలు అనుకునే వారు లేకపోలేదు. అలాంటి ఒక హీరోయిన్ కలలు కన్నది. చేసింది రెండు సినిమాలే అయినా చివరికి ఎలాగోలా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. కానీ హీరోయిన్ గా కాదు, ఒక ప్రధానమైన పాత్ర మాత్రమే. అయితేనేమి చాలు అనుకుంది. మరి ఆ హీరోయిన్ ఎవరు ? ఏ స్టార్ హీరోతో నటించిందో తెలుసా?

ఆమె తెలంగాణకు చెందిన తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ. కెరీర్ పరంగా ఇప్పటి వరకు "మల్లేశం" మరియు "ప్లే బ్యాక్" చిత్రాలు చేసింది. అయినా తన నటనతో హిందీ పింక్ రీమేక్ "వకీల్ సాబ్" లో పవన్ కళ్యాణ్ పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తనకు నటించే స్కోప్ ఉన్న పాత్ర ఇవ్వడంతో బాగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. సినిమా కూడా కమెర్షియల్ గా మంచి హిట్ గా నిలిచింది. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గురించి మరియు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో చెప్పింది. ఆఖరికి పవన్ కళ్యాణ్ మనిషిలా ఉంటారనుకోలేదు ? షూటింగ్ టైం లో మొదటి సారి కలిసినప్పుడే తెలిసింది పవన్ కూడా మనిషేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు ఆమె ఫుల్ ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో సైతం రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇలా పవన్ కళ్యాణ్ తో నటించడం వల్లనే ఈమె ఇంత ఫేమస్ అయిందని సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. మరి చూద్దాం ఈ ఫేమ్ తో ముందు ముందు ఎన్ని సినిమాలలో అవకాశం దక్కించుకుంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: