pspk 28 ప్రీ లుక్ పోస్టర్ : ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారే .. ??
ఇక దాని తరువాత నుండి మరింత భారీ క్రేజ్ తో సినిమాలు చేస్తూ కొనసాగిన పవన్, ఆపై జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో కొనసాగారు. ఇక కొన్నాళ్ల క్రితం వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ మూవీ ద్వారా మళ్ళి ముఖానికి మేకప్ వేసుకున్న పవన్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ మరొక రెండు త్వరలో పట్టాలెక్కించనున్నారు. అయితే వీటిలో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమా హరీష్ శంకర్ ది. గబ్బర్ సింగ్ తరువాత తొమ్మిదేళ్ల అనంతరం వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సెట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని నేడు పవన్ జన్మదినం సందర్భంగా విడుదల చేసారు.
బైక్ మీద నిల్చుని ముఖం కనపడకుండా ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మళ్ళి ఫుల్లీ లోడింగ్ అంటూ రాసి ఉండడం గమనించవచ్చు. అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంటూ ఉప శీర్షిక పోస్టర్ లో ప్రచురించింది యూనిట్. దీనిని బట్టి ఈ సినిమాతో యూనిట్ ఏదో గట్టిగా భారీ స్థాయిలో ప్లాన్ చేసి దీనిని తెరకెక్కించనున్నట్లు సినిమా వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాని మరొక రెండు నెలల్లో సెట్స్ మీదకు తీసుకువెళ్లనుండగా పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అందరిలో ప్రారంభానికి ముందే ఈ విధంగా మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రేపు తెరకెక్కి ఆపై విడుదల తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.