పవన్ కు విషెష్ తెలుపుతూ తమ అభిమానాన్ని చాటిన సెలబ్రిటీలు!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో తన ఇమేజ్ తో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకుని వారికి ఏదో చేయాలని తపన పడే హీరో గా ఉంటాడు పవన్ కళ్యాణ్. సినిమా హీరోలలో హీరోయిన్లలో నటులలో టెక్నీషియన్ల లో కూడా ఈ హీరోకి అభిమానులు భారీ గా ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో ప్రతి ఒక్కరిని అలరిస్తాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కోట్లాది మంది ప్రేక్షకులు లక్షలాది మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు పుట్టినరోజు ను ఘనం గా జరుపుకున్న పవన్ అభిమానులు ఆయనపై అంతులేని ప్రేమను కురిపించారు. 


తాజాగా సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ గురించి పోస్టులు పెట్టి ఆయనకు ప్రత్యక్షంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నితిన్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరో లు సైతం స్టేజి పైనే తమ అభిమానాన్ని చెప్పుకుని ఎంతో మురిసిపోతుంటారు. ఆ విధంగా ఆయన పనిచేసిన, నటించిన వారు తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాలుగు సినిమాలను చేస్తున్నాడు.

 వాటిలో మొదటగా భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల కాగా ఆ పాటకు భారీ స్థాయిలో ఆదరణ దక్కుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తుండటం విశేషం.  ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ కమర్షియల్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భన్ని పురస్కరించుకొని ఆయన నటిస్తున్న కొత్త సినిమా కూడా అనౌన్స్ మెంట్ అయింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: