మెగాస్టార్ ఫ్యామిలీలో అంత విషాదం జరిగిందా...?

murali krishna
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. నిన్న తన 50వ బర్త్ డే జరుపుకున్నాడు. సోషల్ మీడియాలో తన అభిమానులు ఓ రేంజిలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తేలా చేశారట . నిన్న సోషల్ మీడియా అంతా పవన్ నామస్మరనే.

అంతేకాదు పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారట. అటు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ గురించి, ఆయన తోడబుట్టిన వారి గురించి కూడా నెటిజన్లు పలు చర్చలు జరుపుకున్నారట. అయితే ఒకానొక సమయంలో పవన్ కల్యాణ్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి పలు విషయాలు వెల్లడించాడని సమాచారం. ఇంతకీ అస్సలు ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నిజానికి పవన్ కల్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడని అందరికి తెలిసిన విషయమే.అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో పాటు వరుసగా ఏడు సినిమాల్లో విజయం సాధించాడు. ప్రతి సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ వచ్చాడు. తన నాలుగో సినిమా అయిన తొలి ప్రేమతో స్టార్ హీరోగా ఎదిగాడు పవన్ కళ్యాణ్. తన ఏడో సినిమా అయిన ఖుషీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత వరుసగా 8 సినిమాలు బోల్తా కొట్టాయట.  ఎప్పుడు చూడని రీతిలో పరాజయాన్ని మూటగట్టుకున్నాయట. ఆ తర్వాత 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో మళ్లీ సూపర్ హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చాడు.

ఇక ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన ఫ్యాన్స్ అని తెలుస్తుంది. ఆయనను అభిమానించే వారిలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారట. ఆయనంటే ప్రాణం ఇస్తాం అంటారట చాలా మంది. కారణం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వమని తెలుస్తుంది. తను ఎవరినైనా ఎంతో గౌరవిస్తాడట అని చెప్తారు సిని ప్రముఖులు. అయితే తనకు మాత్రం పుట్టిన రోజును గ్రాండ్ గా చేసుకోవడం అంతగా ఇష్టం ఉండదట.అభిమానులు కోరినా.. కేక్ కట్ చేసిన సందర్భాలు లేవని సమాచారం. చిన్నప్పుడు తన ఆర్థిక పరిస్థితుల మూలంగానే బర్త్ డేలు జరుపుకోలేదని సమాచారం. ఇంక ఆర్ధికంగా బాగా ఎదిగిన అదే అలావాటుగా మారిపోయిందని అంటాడట పవన్ కల్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: