జ్యోతిక జోరు.. ఫ్యాన్స్ లో హుషారు..!

NAGARJUNA NAKKA
హీరో సూర్య సతీమణి జ్యోతిక జోరుకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు.  ఈ మధ్య కాలంలో నాన్ స్టాప్ సినిమాలతో యమా బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. దేశాలు దాటి వెళుతోంది. ఇటీవల ఇన్ స్టా ఖాతా తెరిచి ఫాలోవర్స్ విషయంలో తనకంటూ ఒక రికార్డును సొంతం చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తనకు తిరుగులేదని నిరూపించుకుంటోంది జ్యోతిక.

సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే జ్యోతిక తన రూట్ మార్చేసింది. అందరూ ఆశ్చర్యపరిచేలా నిర్ణయాలు తీసుకుంటోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ చెలరేగిపోతోంది. పెళ్లైన తర్వాత ఫ్యామిలీకే పరిమితమైన జ్యోతిక.. ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్ ను మలుచుకుంటోంది. సాధారణంగా సినిమాకు సంబంధించిన విషయాలు.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు బయటకు చెప్పడం చాలా తక్కువ.  అలాంటిది జ్యోతిక ఇటీవల ఇన్ స్టాలో అకౌంట్ ఓపెన్ చేసింది. ఇంకేముందీ జ్యోతిక ఫాలోవర్స్ నిమిషాల వ్యవధిలో పెరిగిపోయారు.  జ్యోతిక ఖాతా తెరిచిన 45 నిమిషాల్లోనే 1.2 మిలియన్ల ఫాలోవర్స్ చేరారు.

నిమిషాల్లోనే ఇంత మంది ఫాలోవర్స్ రావడం అంటే మామూలు విషయం కాదు.  పెద్ద స్టార్ డమ్ ఉన్న హీరోలకే ఇలాంటి రేర్ ఫీట్ సాధ్యం. అలాంటి అరుదైన రికార్డుని జ్యోతిక సాధించింది. జ్యోతిక వరుసగా 2డి ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమాలు చేస్తూ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రాజకీయ సామాజిక అవ్యవస్థకు సంబంధించిన అవస్థలను ప్రశ్నించే కాన్సెప్ట్ ల్ని ఎంచుకుని జ్యోతిక నటిస్తోంది. జ్యోతిక నటించిన పొన్ మగల్ వందల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఉడన్ పిరప్పే అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇవన్నీ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కాయి. చూద్దాం సెకండ్ఇన్నింగ్స్ లో జ్యోతిక ఎలాంటి ఫీట్ అందుకుంటుందో. అరుదైన పాత్రలతో మెరవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: