తెలుగు ఫిలిం ఇండస్ర్టీని రెండు సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు కరోనా లాక్డౌన్ ఇబ్బందులు మరో వైపు టిక్కెట్టు ధరలు ఈ రెండు సమస్యలు కలిసి సినీపరిశ్రమను తీవ్రమైన సంక్షోభంలోకి నెడుతున్నాయి. కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టి టాకీస్లు ఓపెన్ చేస్తున్నప్పటికీ ఆంధ్రా ప్రదేశ్లో సినిమా టిక్కెట్ల ధరలు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఎటువంటి నిర్ణయం వెల్లడిస్తారోనని సినీ ఇండస్ర్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయమై టిక్కెట్టు ధర సహా పరిశ్రమలోని పలు సమస్యలపై చర్చించేందుకు మంత్రి పేర్ని నాని సినీ రంగంలోని పెద్దమనుషులను ఆహ్వానించారు.
అందులో మెగాస్టార్ చిరంజీవి - అక్కినేని నాగార్జున సహా పలువురు సినీ పరిశ్రమ దిగ్గజాలు ఆంధ్రా సీఎం జగన్ ను త్వరలో కలవనున్నట్టు పుకార్లు వెలువడుతున్నాయి. సెప్టెంబర్ 4న ముహూర్తం కూడా చేశారని ఇటీవల కొంతమంది ప్రచారం చేశారు. కానీ దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారికంగా ప్రకటన జరగలేదు. దీంతో ఈ సమావేశం కూడా రద్దయిందని గుసగుసలు. అయితే ఎపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్తో ఉన్నారు. ఆయన మొన్నటి దాకా తన ఫ్యామిలీతో గడపడానికి వెళ్లారు. ఇప్పుడు కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ పై పూర్తిగా దృష్టి పెట్టినట్టు సమాచారం. విశాఖ నుంచి భోగాపురం మధ్య కొన్నివందల వేల కోట్లతో జరగాల్సిన పనులపై పూర్తి క్లారిటీతో ముందుకు వెళుతున్నారు. దాని కోసం గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ (జీవీఎంసీ) డీపీఆర్ లతో ఈ పనులను పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పాలనాపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఏది ఏమైనా సినీపెద్దలను కలవడానికి ముందే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్లాన్ రెడీ విడుదల చేయనున్నారట. ఏపీలో సినిమా టిక్కెట్టు రేట్లు ఎలా ఉండాలి. పరిశ్రమలో జీతాలు సహా ఇతర అంశాలపై మల్లాగుల్లాలు పడుతున్నారు. ఈ అన్ని అంశాలపై ఇండస్ట్రీ నిపుణుల నుంచే సలహాలు కోరుతున్నారు. ఇది వరకే ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారని టాక్ .