బిగ్ బాస్ 5 స్టార్ట్.. కంటెస్టెంట్స్ వీళ్లే ?

praveen
బుల్లితెరపై ఎన్ని రకాల కార్యక్రమాలు వస్తున్న ఒక సారి బిగ్ బాస్ స్టార్ట్ అయింది అంతే చాలు అన్ని సైడ్ అయిపోతాయ్. ఇక ఈ షోకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు అని చెప్పాలి . హిందీ తమిళ్ తెలుగు మలయాళం ఇలా ఎన్నో భాషల్లో బిగ్బాస్ చేసినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తే ఉన్నారూ. అయితే ఇప్పుడు వరకు తెలుగులో ఏకంగా నాలుగు సీజన్లను ఎంతో సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఇక రేపటి నుంచి బిగ్ బాస్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.



 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు నుంచే బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ప్రతిరోజు ఏదో ఒక కొత్త వార్త అటు ప్రేక్షకులను అలరించింది  అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతూ వచ్చాయి  ఇక రేపటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుండగా.. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రేపు ఈ షో ప్రారంభం కాబోతుండడంతో ఈరోజే కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపబోన్నారు.



 ఇప్పటి వరకు వివిధ హోటల్లలో క్వారంటైన్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి  ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు పూర్తవుతుందట. ఇక ఆ తర్వాత రేపు ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు అన్నదానిపై  స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి హౌస్‏లోకి వెళ్తున్నారు. ఇటీవలే కొన్ని కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నటుడు విశ్వ, సింగర్ శ్రీ రామచంద్ర కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. ఇక దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: