బాలయ్య తో పోటీకి సై అంటున్న ఎన్టీఆర్ ... ??
అయితే దీని తరువాత కొరటాల శివ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు ఎన్టీఆర్. ఇక మరొకవైపు ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ షూట్ ఇటీవల పూర్తి చేసారు నటసింహం బాలయ్య. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా త్వరలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. దీని అనంతరం క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో తన నెక్స్ట్ సినిమా చేయనున్నారు బాలయ్య. అయితే విషయం లోకి వెళ్తే, అటు ఎన్టీఆర్ తదుపరి సినిమా అలానే ఇటు బాలయ్య తదుపరి సినిమా రెండూ కూడా వచ్చే ఏడాది వేసవి బరిలో కేవలం కొద్దిరోజుల గ్యాప్ లోనే తలపడనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
కొరటాల, ఎన్టీఆర్ మూవీని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ నిర్మిస్తుండగా బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. కాగా వీటిలో బాలయ్య సినిమా పక్కా మాస్ యాక్షన్ డ్రామా గా రూపొందనుండగా, ఎన్టీఆర్ మూవీ మంచి మెసేజ్ తో పాటు భారీ కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్నట్లు టాక్. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉండడంతో, ఒకవేళ రాబోయే వేసవికి అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ సినిమాలు కనుక ఒకేసారి తలపెడితే బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.