మామూలుగా ఎవ్వరైనా తమ బిడ్డలకు తాము బ్రతికుండగానే పెళ్లి చేసి సంతోష పడాలి అనుకుంటారు. కానీ కొందరు విషయంలో ఇది తీరని కోరికగానే మిగిలిపోతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రణ్ బీర్ కపూర్ పెళ్లి విషయం ఎప్పటికీ పీటలెక్కుతుందా అని తన కుటుంబంతో పాటుగా అభిమానులు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకో ఇంకా ఈ విషయంలో సరైన స్పష్టత రావడం లేదు. కానీ రన్ బీర్ ప్రేమ వివాహం చేసుకుంటారని గతంలో రెండు సార్లు వార్తలొచ్చినా అవి వివిధ కారణాల వలన ఆగిపోవడం జరిగింది. గతంలో దీపిక పదుకునే ను ప్రేమించి రన్ బీర్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థల కారణంగా వారి బంధం రద్దయింది.
ఆ తర్వాత కత్రినా కైఫ్ తో ప్రేమాయణం నడిపించాడు. ఇది కూడా పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. కొంత కాలం నుండి మహేష్ భట్ కూతురు ఆలియా భట్ తో లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్యన కూడా ఏవో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తే అసలు రన్ బీర్ కపూర్ కి ఎప్పుడు పెళ్లి అవుతుంది అని అతని తల్లి నీతు కపూర్ చాలా ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ వాస్తవానికి రిషి కపూర్ బ్రతికి ఉన్నప్పుడు రన్ బీర్ కు పెళ్లి చేసి పెషావర్ పెళ్లి కొడుకు గెటప్ లో చూడాలని ఆశపడ్డాడట.
కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన చనిపోయారు. రన్ బీరు తండ్రి కోరికను అర్థం చేసుకుని త్వరలోనే ఆయన కోరికను నెరవేర్చాలని రన్ బీర్ తల్లి కోరుకుంటున్నారు. మరి తండ్రి కోరికను రన్ బీర్ నిజం చేస్తాడా అన్నది త్వరలోనే తెలియాల్సి ఉంది.