నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మా ఎన్నికలపై ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి తప్పుకుంటున్నానని..సొంతంగా బరిలోకి దిగుతున్నానని బండ్ల గణేష్ ప్రకటించారు. ముందు నుండి బండ్ల గణేష మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవిని ఆశించినట్టు కనిపిస్తోంది. కానీ ప్రకాష్ రాజ్ ఆ పదవి కోసం మరో ఇద్దరి పేర్లు ప్రకటించి బండ్లకు స్పోక్స్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. కానీ బండ్ల గణేష్ తనకు స్పోక్స్ స్పర్సన్ పదవి సంత్రుప్తిని ఇవ్వలేదని సున్నితంగా తిరస్కరిస్తూ ఆ పదవికోసం మరొకరిని చూసుకోవాలని ప్రకాష్ రాజ్ కు సలహా ఇచ్చారు. అంతే కాకుండా బండ్ల గణేష్ మా ఎన్నికలపై వరుస ట్వీట్లు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట తప్పను..మడమ తిప్పనని..తనిది ఒకటే మాట -ఒకటే బాట అని బండ్ల వ్యాక్యానించారు.
నమ్మడం, నమ్మినవారికోసం బతకడం..నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటానని...నేను ఎవరిమాట విననని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తానని...పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదని-తనను పోటీ చెయ్ అంటోందని అందుకే ఈ పోటీ చేస్తున్నానని బండ్ల అన్నారు. అందరికీ అవకాశం ఇచ్చారని...ఒకే ఒక అవకాశం ఇవ్వాలని తానేంటో చూపిస్తానని చెప్పారు.
నా పరిపాలన ఎంటో తెలియచేస్తా..వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడమే తన ధ్యేయమని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. దానికోసమే పోరాడతానని... వారి సొంత ఇంటి కలను నిజం చేస్తానని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదని కాబట్టి ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలని.. ఇక అలా జరగొద్దని అన్నారు. అందరి ఆశీస్సులు తనకు కావాలని..మా ను బలోపేతం చేద్దామని బండ్ల వ్యాఖ్యానించారు.