సినిమా చూసి సీటీ కొట్టకుండా ఉండలేరని అంటున్న గోపిచంద్..!!

Anilkumar
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ కి ఓ సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈ మధ్య గోపిచంద్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నాయి.దింతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ మ్యాచో హీరో.ఈ నేపథ్యంలో అతి త్వరలోనే ప్రేక్షకులతో సీటీ కొట్టించడానికి రెడీ అవుతున్నాడు. గోపిచంద్ కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న తాజా చిత్రం 'సీటీమార్'.సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన తమన్నా హీరోయిన్ గగా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆంధ్ర గర్ల్స్ కబడ్డీ టీమ్ కోచ్ గా...అలాగే తమన్నా తెలంగాణా గర్ల్స్ కబడ్డీ టీమ్ కోచ్ గా కనిపించనున్నారు.

ఇక ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్,పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసాయి.ఇక వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గురించి హీరో గోపిచంద్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.ఇక గోపిచంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, చాలా అవాంతరాల మధ్య ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేశామని..ఇక కబడ్డీ టీమ్ లో నిజంగా ఆట గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఓ నలుగురు ఉన్నారని తెలిపారు.ఇక మిగతా వాళ్ళకి కొంత కాలం పాటు ట్రెయినింగ్ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

 

ఇక మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన అమ్మాయిలు చాలా కష్టపడ్డారనీ..ట్రెయినింగ్ సమయంలోనూ, షూటింగ్ సమయంలోనూ ఎన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకున్నారని..వాళ్ళ అంకిత భావాన్ని చూసి నేను చాలా ఆశ్చర్య పోయానని చెప్పుకొచ్చాడు గోపిచంద్.ఇక తెలుగులో మొదటిసారిగా పూర్తి కబడ్డీ నేపథ్యంలోనే రూపొందిన సినిమా ఇది.ఈ సినిమాను చూస్తూ సీటీ కొట్టకుండా ఉండలేరంటూ చెప్పాడు గోపిచంద్.ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ తో పాటు సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. మరి రేపు విడుదల తర్వాత గోపిచంద్ చెప్పినట్లుగానే ఆడియన్స్ చేత ఈ సినిమా సీటీ కొట్టిస్తుందా చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: