మెగాస్టార్ మూవీ లో మాస్ రాజా ... ??
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తో పాటు మరోవైపు గాడ్ ఫాదర్ మూవీ కూడా చేస్తున్నారు మెగాస్టార్. మోహన్ రాజా తీస్తున్న ఈ మూవీ, మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. దాని తరువాత మెహర్ రమేష్ తో భోళా శంకర్ తో పాటు పవర్ మూవీ డైరెక్టర్ బాబీ తో కూడా ఒక సినిమా చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమాల తరువాత కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై చరణ్ నిర్మించనున్న ఎన్నై అరిందాల్ తెలుగు రీమేక్ లో కూడా చిరంజీవి యాక్ట్ చేయనున్నట్లు సమాచారం. తమిళ్ కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తెలుగులో ఎంతవాడు గాని పేరుతో విడుదలై ఇక్కడకి ఆడియన్స్ నుండి కూడా క్రేజ్ దక్కించుకుంది.
అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న చరణ్, ప్రస్తుతం ఈ మూవీలో మెగాస్టార్ తో కలిసి మరొక ముఖ్య పాత్రలో యాక్ట్ చేసేందుకు నటుడిని వెతుకుతున్నారని, కాగా ఆ పాత్రకి మాస్ మహారాజ రవితేజ అయితే ఆల్మోస్ట్ పక్కాగా సరిపోతాడని చిరు, చరణ్ ఇద్దరూ భావిస్తున్నట్లు సమాచారం. ఆ క్యారెక్టర్ ని తమిళ్ అరుణ్ విజయ్ పోషించారు. త్వరలో ఈ మూవీ డైరెక్టర్ తో పాటు మిగతా క్యాస్టింగ్ మొత్తాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే రవితేజ హీరోగా మారిన తరువాత మెగాస్టార్ తో చేయబోయే తొలి సినిమా ఇదే అవుతుంది.