నారప్ప సూపర్ హిట్.. కానీ ప్రేక్షకుల కోరిక తీరలేదు?
ఇలా ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన సినిమా కూడా ఒకటి. తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. నాచురాలిటికి దగ్గరగా రా కంటెంట్ తో ఉండే ఈ సినిమా ప్రేక్షకుల అందరిని మంత్రముగ్దుల్ని చేసింది అని చెప్పాలి. ఇక ఇలాంటి రా కంటెంట్ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో క్రేజ్ వున్న వెంకటేష్ తో తీయాలనుకుని దర్శకుడు ఒక సాహసమే చేశాడు. అదే సమయంలో అటు కథలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండానే తెలుగులో తెరకెక్కించాలని నిర్ణయించుకొని మరో సాహసం అనే చెప్పాలి.
సాధారణంగా రీమేక్ సినిమాలో చేస్తున్నప్పుడు ఇక ఆ హీరో కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేస్తారు. కానీ ఇటీవలే ఇక వెంకటేష్ హీరోగా నటించిన అసురన్ రీమేక్ సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా స్టోరీ బాగా కనెక్ట్ అయ్యింది. మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ నీ బాగా తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అదే సమయంలో అటు పాత్రలో ఒదిగిపోయి నటించిన వెంకటేష్.. పాత్రకు ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇలా నారప్ప సినిమా లోని ప్రతి పాత్ర ప్రతి సన్నివేశం కూడా అటు సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులందరూ మనసును తాకింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్ లో చూడలేక పోయాము అని ఒక్క బాధ తప్ప.. వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.