నువ్వు నాకు నచ్చావ్ @ 20 ఇయర్స్.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా..?

Divya
వెంకటేష్ అప్పట్లో నటించిన చాలా సినిమాల కారణంగానే ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందాడు. ఈయన దాదాపు అన్ని సినిమాలలో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లోనే నటించడం గమనార్హం. ఇకపోతే ఆయనకున్న స్టార్ ఇమేజ్ పక్కన పెడితే, ఫ్యామిలీ సినిమాలే ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.. కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఫ్యామిలీ ఎలివేషన్స్ తో కూడిన సినిమాలు తీయడం కేవలం వెంకటేష్ కి సాధ్యమవుతుంది.. వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లలో, ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేని సినిమా నువ్వు నాకు నచ్చావ్.. ఇందులో వెంకటేష్ ,సునీల్ , బ్రహ్మానందం కామెడీ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఇంకా ఇందులో ఎప్పుడూ కోపంగా వుండే అమ్మాయిలాగా ఆర్తి అగర్వాల్ బాగా నటించింది. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, సుధా ,సుహాసిని, హేమ, ఎం.ఎస్.నారాయణ ,తనికెళ్ల భరణి, చంద్రమోహన్ తదితరులు నటించడం గమనార్హం. కే విజయభాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించాడు.. ఇందులో ప్రతి మాట కూడా ప్రేక్షకులను బాగా నవ్వించేశాయి.. ఇకపోతే ఈ సినిమా విడుదలై నేటికి 20 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.అంతేకాదు ఈ సినిమాతోనే ఆర్తి అగర్వాల్ మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి అని చెప్పవచ్చు.

ఈ సినిమా పాటలు అప్పట్లో రేడియోలో కూడా వినిపించేవి.. టీవీలు లేని సమయంలో చాలామంది రాత్రి సమయం ఎప్పుడు అవుతుంది.. రేడియో లో ఈ పాటలు ఎప్పుడు విందాం అని కూడా ఎదురు చూస్తూ ఉండే వారు.. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే థియేటర్ల వద్ద ఈ సినిమా ఎన్ని కలెక్షన్లను రాబట్టింది అంటే..7.24 కోట్ల రూపాయల వరకు  థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.18.04 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా బయ్యర్లకు రూ.10.8 కోట్ల లాభాలు వచ్చాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: