బాలయ్య నుంచి గుడ్ న్యూస్ వచ్చేది అప్పుడే!!

P.Nishanth Kumar
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే సినిమాను విడుదల చేసే విధంగా బాలకృష్ణ ఆలోచిస్తున్నాడట.  ఆయన తదుపరి చిత్రంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాతో పాటు మరిన్ని చిత్రాలు తెరకెక్కించే ఈ విధంగా రాధాకృష్ణ ప్లాన్ చేశాడట. ఈ నేపథ్యంలోనే కొంతమంది యువ దర్శకులకు ఆయన అవకాశాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది.

ఇటీవలే వరుస సినిమాలతో దూసుకు పోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా బాలకృష్ణ పుట్టిన రోజున ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సాహూ గారపాటి దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దసరా పండుగకు ఈ ప్రాజెక్టు గురించి అనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పకనే చెప్పాడు. ఆయన నిర్మాణం లో టక్ జగదీష్ అనే సినిమా రాబోతుండగా దానికి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

మరోవైపు అనిల్ రావిపూడి f3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుంది. దసరా కి బాలయ్య అఖండ సినిమా విడుదల అంటున్నారు.  ఆవిధంగా దసరాకు బాలకృష్ణ కు సంబంధించిన రెండు సినిమాల శుభవార్త లు చూడోచ్చన్న మాట. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. మరి ఇవి నిజమో కాదో తెలియాలంటే ఈ సినిమాల అనౌన్స్ మెంట్ వచ్చేదాకా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: