బిగ్ బాస్ సీజన్ 5 ఫుల్ కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. గత సీజన్ ల కంటే ఈ సీజన్ లో గ్లామర్ డోస్ ను నిర్వాహకులు మరింత పెంచారు. బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీలలో సరయు, శ్వేత వర్మ, లహరి, శిరీష, హమీదా లు ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో వీరందరికీ లేని క్రేజ్ శైలజ ప్రియాకు కనిపిస్తోంది. శైలజ ప్రియ సినిమాలలో అక్క..వదిన క్యారెక్టర్ లు చేసి టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాంకుడా టీవీ సీరియల్స్ లో నటిస్తూ టీవీ ప్రేక్షకులను సైతం ప్రియా సంపాదించుకుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే శైలజా ప్రియాకు యూత్ లో అభిమానులు ఉండటం మరో ఎత్తు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు అయిన ప్రగతి, సురేఖ వాణికి హీరోయిన్ లకుఉన్న రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే అదే రేంజ్ ఫాలోయింగ్ ప్రియా కు ఉన్నట్టు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
బిగ్ బాస్ లోకి శైలజా ప్రియా ఎంట్రీ ఇవ్వడంతో మిగతా కంటెస్టెంట్ లను పక్కన పెట్టేసి మా ఫుల్ సపోర్ట్ ప్రియా ఆంటీకేనని నెటిజన్లు అంటున్నారు. నిజానికి చూడ్డానికి శైలజా ప్రియా చాలా యంగ్ గా కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు చాలా సన్నబడింది కూడా. దాంతో చూసేందుకు మరింత యంగ్ గా కనిపించడంతో యూత్ అంతా ప్రియా ఆంటీకే జై అంటున్నారు. మీమ్స్ కూడా ఎక్కువగా ప్రియా పేరుమీదే కనిపిస్తున్నాయి. మరోవైపు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమాదేవికి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ దర్శనం ఇస్తున్నాయి. ఇలా ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మిగతా ముద్దు గుమ్మల కంటే ఎక్కువ ఫాలోయింగ్ కనిపిస్తుండటంతో అంతా షాక్ అవుతున్నారు.
మరోవైపు ప్రియాను విన్ చేసి తీరతామని ఓట్లన్నీ ప్రియాకే వేస్తామని కూడా కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫాలోయింగ్ కనక చివరివరకూ ఇలానే కొరసాగితే ప్రియా ఫైనల్ కు వెల్లడం కాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికైతే హౌస్ లో ఉన్నవారిలో యాంకర్ రవి, వీజే సన్నీ, సరయు, లోబో, ప్రియా, పావుషేరు బాగ్యం లు , షణ్ముక్ జశ్వంత్ కాస్త జనాలకు తెలిసిన ముఖాలు. కానీ తెలిసిన ముఖాలు అయినా చివరి వరకూ ఆటను బట్టి అభిమానులు ఏర్పడటం టైటిల్ గెలుచుకోవడం జరుగుతుంది.