ఆదివారం బిగ్‌బాస్ సిజన్ 5 అట్టహాసంగా ప్రారంభమైంది. గత ఏడాది లాగే కింగ్ నాగర్జున గారే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందరూ అనుకున్నట్టే షణ్మక్ జస్వంత్, అణీ మాస్టర్, లోబో, యాంకర్ రవి లతో పాటు మొత్తం పంతోమ్మిది మంది కంటేస్టంట్ లుగా వచ్చారు. పంతోమ్మిదో కంటేస్టంట్‌గా యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కింగ్ నాగర్జున యాంకర్ రవి వివాహం గురించి అడిగారు. అయితే సర్ నా ఫ్యామిలీ గురించి మాట్టాడం వద్దు సర్ అని అన్నాడు. గతంలో తనకు పెండ్లి అయిందనే విషయాన్ని దాచి ఎన్నో షోలు చేశాడు. తనకు వివాహం కాలేదన్నట్టే వ్యవహరించాడు. పలు ఇంటర్‌వ్యూ లలో, కొన్ని షోలలో తన పెళ్లి గురించి ప్రస్తావణ వచ్చిన అగ్గి మీద గుగ్గులంల ప్రవర్తించేవాడు. ఆ ప్రశ్న వేసే వారితో వాగ్వాధం చేసేవాడు. సడన్‌గా ఒక రోజు తనకు వివాహం అయిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతే కాదు తన భార్య, కూతురు ఫోటోలను సైతం సోషల్ మీడియా ద్వారా పంచుకుంన్నాడు.
యాంకర్ రవి తన వివాహం గురించి ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇన్ని రోజులు తనకు పెళ్లే కాలేదు అన్నవాడు సడన్ గా తనకు పెళ్లి అయిందని, కూతురు కూడా ఉందని చేప్పడంతో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో యాంకర్ రవి వ్యాఖ్యాతాగా నిర్వహించిన ఢీ షోలో యాంకర్ లాస్యతో ప్రేమలో ఉన్నాడని పుకార్లు ఎన్నో వచ్చాయి. ఆ పుకార్లకు దానికీ ధీటుగానే లాస్యతో చనువుగానే ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత యాంకర్ లాస్య మంజునాధ్ అనే అతన్ని ప్రేమిస్తున్నాని ప్రకటించింది. అలాగే అతన్నే పెళ్లి చేసుకుంది. యాంకర్ రవి లాస్యతో పాటు పటాస్ షో సమయంలో యాంకర్ శ్రీముఖీతో ప్రేమలో పడ్డారని గాస్సిప్స్ వచ్చాయి. దీని పై యాంకర్ రవి స్పందించకుండా కాలయాపన చేశారు. ఆ ప్రేమాయణాలు అన్ని పుకర్లేనని చెప్పి తన వివాహం గురించి ప్రకటించారు.