గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సిటీ మార్'. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త బాగుండడంతో ఈ సినిమా సెప్టెంబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే చిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చూసిన మెగాస్టార్ చిరంజీవి తన స్పందనను తెలియజేశాడు. మెగాస్టార్ మాటల ప్రకారం 'సిటీ మార్' సినిమా ట్రైలర్ నేను చూశాను.
చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు. సంపత్ నంది మంచి కథకుడు. అతను చాలా బాగా నెరేట్ చేస్తాడు. సంపత్ నంది నాకు 'రచ్చ' సమయం నుండి తెలుసు.ఈ సినిమా కోసం సంపత్ నంది గ్రామీణ క్రీడ కబడ్డీ ని తీసుకున్నాడు. అది చాలా గొప్ప అంశం. ఈ కథ కోసం సంపత్ నంది కొంతమంది అమ్మాయిలను తీసుకొని వారికి శిక్షణ ఇప్పించి మరి ఈ సినిమాలో నటింపజేసాడు. ఇలాంటి కథలు రావడం చాలా ముఖ్యం. ఆడవాళ్ళు తమ పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగారు లాంటి గొప్ప కథను ఎంచుకున్నాడు సంపత్ నంది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని నేను భావిస్తున్నాను అంటూ చిరంజీవి తెలిపాడు. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చరు. ఈ సినిమాలు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిత్తూరు నిర్మించారు. ఈ సినిమా తో గోపీచంద్ ఎలాంటి విజయాన్ని సాధిస్తారు తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు ఆగాల్సిందే.