ఇప్పుడు అందరూ హీరోలు తమ సినిమాలతో వరుసగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే
మాస్ రాజా
రవితేజ తన తదుపరి సినిమాకు సంబంధించిన పనులను వేగవంతం చేశాడు. ఈ సంవత్సరం
క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చిన
రవితేజ తన తదుపరి చిత్రం కిలాడి నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఆఖరి షెడ్యూల్ మొదలు కాగా మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తి కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ
సినిమా ఈ ఏడాది చివర్లో తీసుకువచ్చేందుకు
రవితేజ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించే ఈ చిత్రం త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను కూడా త్వరలోనే విడుదల చేయాలని మొదట ఇవ్వడం చూస్తుంటే ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ
సినిమా పూర్తి కాకముందే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను మొదలు పెట్టాడు
రవితేజ ఈ చిత్రం
రవితేజ కెరీర్లో 67వ సినిమాగా తెరకెక్కుతున్న ఉండగా ఆయనకు ఈ
సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అని అంటున్నారు. గత కొన్ని సినిమాలు గా ఫ్లాప్ లు ఎదుర్కుంటున్న
రవితేజ తో
క్రాక్ తో హిట్ కొట్టి ఆ
జోష్ లో వరుస సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని సినిమాల్లో చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మరికొన్ని కథలు వింటున్నాడు. మరి ప్రేక్షకులను తర్వాత ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.