బిగ్ బాస్ సీజన్ 5 లో నామినేషన్స్ రచ్చ...!

murali krishna
తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. హౌస్‌లోకి ఎంటరైన 19 మంది కంటెస్టెంట్లలో కొందరు బుల్లితెరపై పాపులర్ స్టార్స్ కూడా ఉన్నారు.

మరికొందరు యూట్యూబర్స్. ఎవరు ఏదైనా కూడా బిగ్ బాస్ తొలి రోజు నుంచే తన ఆటను షూరూ చేసినట్లు సమాచారం.ప్రతీ సోమవారం ఎలిమినేషన్స్ ప్రక్రియ ఉంటున్న అందరికి తెలిసిన విషయమే.అందులో భాగంగా మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసిందని తెలుస్తుంది.

హౌస్‌లో ఉన్న 19 మంది కంటెస్టెంట్లలో ఫోటోలను చెత్త కవర్‌లకు పెట్టినట్లు తెలుస్తుంది.ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి ఫోటోతో ఉన్న చెత్త కవర్‌ను డస్ట్ బిన్‌లో వేయాలని చెబుతూ బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టాడని తెలుస్తుంది.అగ్గి రాజేస్తే హౌస్‌మేట్స్ మధ్య గొడవ మొదలు కావడం ఖాయమని తెలుస్తుంది.

ప్రోమో ప్రకారం మొదట నామినేట్ చేసేందుకు లోబో వచ్చాడు. అతడు నవ్విస్తూనే నామినేట్ చేసినట్లు సమాచారం.అయితే యాంకర్ రవి ఫోటో ఉన్న చెత్త కవర్‌ను తీసుకుని ”నీ యాటిట్యూడ్ నీ దగ్గరే పెట్టుకో” అంటూ లోబో ఇచ్చిపడేశాడడని తెలుస్తుంది. అనీ మాస్టర్ సిరి హనుమంత్‌ని నామినేట్ చేసినట్లు సమాచారం.ఇక సరయు ఏమో కాజల్‌ను నామినేట్ చేసిందట.

నటరాజ్‌ మాస్టర్‌ను యాంకర్ రవి నామినేట్ చేసాడట. ”మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రిక్ట్‌గా అనిపిస్తున్నారంటూ” తన నామినేషన్‌కు గల కారణాన్ని వివరించాడట యాంకర్ రవి.ఇక ఈ నామినేషన్ యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్ మధ్య పెద్ద రచ్చకు దారి తీసిందని సమాచారం. అటు నటరాజ్ మాస్టర్ కూడా యాంకర్ రవిని నామినేట్ చేస్తూ ”నేను అలాగే ఉంటాను అన్నట్లు తెలుస్తుంది.నాకు నటించడం అస్సలు రాదు” అంటూ కౌంటర్ ఇచ్చాడట.

అలాగే షణ్ముఖ్‌, సన్నీ మధ్య కూడా పెద్ద గొడవ జరిగిందని సమాచారం. 'మనం ఏం చేసినా సైన్యం ఉందని అనుకుంటాం కానీ ఇక్కడకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ ఓ సైన్యం ఉంటుంది' అని అంటూ సన్నీ షణ్ముఖ్‌ను నామినేట్ చేసాడట.'ఏమో నాకైతే ఆ ఫీలింగ్ లేదు' అని షణ్ముఖ్‌ అన్నాడట. ఆ తర్వాత సరయు ఫైర్ అయిందని తెలుస్తుంది. అలాగే జెస్సీ-విశ్వల గొడవ చివర్లో జెస్సీ ఏడుపు.అలాగే నటరాజ్ మాస్టర్ ఇలా ప్రోమో ముగుస్తుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: