తగ్గేదే లే.. అంటోన్న ఆంటీస్..!

NAGARJUNA NAKKA
వెండితెరను కొత్త అందాలు తాకుతున్న కొద్దీ.. ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతుంటారు. పాత వాళ్లను ఇంపార్టెన్స్ ఇస్తూనే కుర్ర భామలకు ఆదరిస్తారు. అవకాశాలు దూరమవుతున్నా.. లేక ఫ్లాప్ లు చవిచూసినా వాళ్లు వెనక్కే వెళ్లిపోతారు. దీంతో అలాంటి వాళ్లను పట్టించుకోవడమే మానేస్తారు మనోళ్లు. అయితే సీనియర్ హీరోయిన్లు మాత్రం తమలో ఆ టాలెంట్ ఇంకా ఉందని రుజువు చేస్తున్నారు. మేకప్ వేసుకొని సత్తా చూపిస్తున్నారు. ఖుష్బూ సినిమాలు తగ్గించి చాలా కాలమైంది. తమిళ్‌తో పాటు, తెలుగులోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ ఇటీవల  ఖుష్బూ పోస్ట్ చేసిన ఫోటోతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. 50 ఏళ్ల వయసులో ఖుష్బూ ఇంత సన్నగా ఎలా తయారైందని చాలామంది ఆశ్చర్యపోయారు. అలాగే ఖుష్బూకి ఆఫర్స్‌ మరింత పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ మాజీ హీరోయిన్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.  
ఇక రమ్యక్రిష్ణ హీరోయిన్‌గా రిటైర్ అయి చాలా కాలమైంది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌ చేసింది. సపోర్టింగ్‌ రోల్స్‌ లో తన పవర్ ఏంటో చూపించింది. అయితే తల్లి పాత్రలు చేస్తున్నా రమ్యకృష్ణ  క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 'బాహుబలి' తర్వాత ఈమె పాపులారిటీ మరింత పెరిగింది. అందుకే 50 ఏళ్ల వయసులో కూడా లీడ్ రోల్స్‌ ప్లే చేస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో నాగార్జునతో జోడీ కట్టిన రమ్య, ఇప్పుడీ మూవీ ప్రీక్వెల్ 'బంగార్రాజు'లో హీరోయిన్‌గా చేస్తోంది.
విజయశాంతి కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అనే రేంజ్‌లో రెమ్యనరేషన్ తీసుకుంది. అయితే హీరోయిన్‌గా రిటైర్‌ అయి 55 ఏళ్ల వయసులో మళ్లీ సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా విజయశాంతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 'సరిలేరు నీకెవ్వరు' ఫంక్షన్‌లో చిరంజీవి కూడా విజయశాంతి కటౌట్‌ చూసి ఆశ్చర్యపోయాడు. మళ్లీ కలిసి సినిమా చేద్దాం అన్నట్లుగా మాట్లాడాడు. మేకర్స్ కూడా ఆఫర్స్‌తో సిద్ధమవుతున్నారు. అయితే ఈమె మాత్రం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్‌తో బిజీ అయ్యింది. చూద్దాం.. మరి ఈ సీనియర్ హీరోయిన్లు ఈ వయసులో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: