కొత్తరకం కథతో తెరకెక్కిన సర్కార్..!

Pulgam Srinivas
ఇప్పటివరకు ఎన్నో ఇతర భాషల సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి, అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయవంతమైన సినిమాలుగా నిలవగా, మరికొన్ని మాత్రం అంతగా సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి. కానీ తెలుగులోకి డబ్ ఆయన సినిమాల్లో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న వాటిని మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటున్నారు. అలా తమిళ భాష నుండి తెలుగులోకి డబ్ అయ్యి తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన సినిమా 'సర్కార్' చిత్రం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తమిళం టాప్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కార్'.  ఈ సినిమాలో హీరో ఒక పెద్ద కంపెనీ సీఈఓ గా మనకు కనబడతాడు. ఇతను విదేశాలలో ఒక కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్న రోజులలో భారతదేశంలో ఎలక్షన్స్ ఉండడం వల్ల అతను ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇండియాకు వస్తాడు. తన ఓటును వేయడం కోసం ఎలక్షన్ బూతు కి వెళ్ళిన అతనికి తన ఓటును ఎవరో దొంగ ఓటు వేశారు అని తెలుస్తుంది. దానితో తన ఓటును ఎలాగైనా వినియోగించుకోవాలి అని ఉద్దేశంతో కోర్టులో కేసు వేస్తాడు. దానితో చిలికి చిలికి గాలివానగా మారి ఎలక్షన్ చివరగా రద్దు అవుతుంది. ఇలా దాదాపు ఎప్పుడు రాని ఒక కథతో మురుగదాస్ 'సర్కార్' సినిమాను తెరకెక్కించాడు. అందుకే ఈ సినిమా తమిళ ప్రజల తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించింది. ఈ సినిమాకు మరో ముఖ్యమైన అంశం సంగీతం. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సమకూర్చిన సంగీతం ఈ సినిమా విజయంలో ప్రముఖ పాత్రను పోషించింది. 6 నవంబర్ 2018 లో విడుదలైన ఈ సినిమా ఒక మంచి సినిమాగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: