ఎన్టీఆర్ సినిమాను నిషేదించిన అప్పటి ప్రభుత్వం.. అసలు ఎం జరిగిందంటే...?
కానీ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా మాత్రం విడుదలైన 50 రోజుల వరకు థియేటర్లలో పూర్తిగా ప్రదర్శన జరిగిందని సమాచారం. కానీ అందులో ఉన్న సన్నివేశాలు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయట.ఆ తర్వాత సినిమా నుంచి తొలగించడం కూడా జరిగిందట.అయితే ఎందుకు ప్రభుత్వ విధానాలకు ఆ సినిమా వ్యతిరేకంగా ఉంది. అనే విషయాలను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..
ఎన్టీఆర్ నిర్మిస్తున్న తాతమ్మ కల చిత్రానికి డి.వి.నరసరాజు రచయితగా పనిచేశారట. ఎన్టీ రామారావు హీరోగా 1974 సంవత్సరంలో ఎన్టీఆర్ స్వీయదర్శకత్వంలో తాతమ్మకల చిత్రం విడుదల అవడం జరిగిందని తెలుస్తుంది. హీరోహీరోయిన్లుగా రామారావు మరియు కాంచన నటించగా ప్రధాన పాత్రలో భానుమతి నటించడం విశేషం. అంతే కాదు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ కూడా ఈ సినిమాలో నటించడం మరో విశేషం. పల్లెటూరి అమాయకత్వాన్ని మరియు పట్నం పోకడలను కలిపి కళ్ళకు కట్టినట్లుగా ఈ చిత్రంలో చూపించారట. అయితే ఈ చిత్రంలో ప్రభుత్వ విధానాలు అయిన కుటుంబనియంత్రణ మరియు భూసంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా ఈ చిత్రం రావడం జరిగిందట. అప్పట్లో శాసనసభలో ఈ సినిమాపై తీవ్ర దుమారం రేపడం తో ఒకరు ముద్దు ఆపై వద్దు అని ప్రభుత్వం విధానానికి ఈ చిత్రం వ్యతిరేకంగా ఉందని తెలుస్తోంది.ఈ చిత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటు నిషేధించిందని సమాచారం.
ఇక NT రామారావు తన ఉద్దేశం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదని తెలిపారట.అందరూ కష్టపడి చేస్తే కుటుంబ నియంత్రణ అలాగే భూసంస్కరణలు అవసరం ఉండదని తన అభిప్రాయమని చెప్పుకొచ్చారని సమాచారం. ఇక ఈ సీన్ లను తీసి వేసి ఎన్టీఆర్ మరియు భానుమతి ల మధ్య కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. తిరిగి ఆ సినిమాలో యాడ్ చేయడం జరిగిందని తెలుస్తుంది. ఇలా చిత్రం మంచి విజయాన్ని అందుకుందట. అలాగే ఉత్తమ కథగా నంది అవార్డును కూడా సొంతం చేసుకుందని సమాచారం.