టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు దిల్ రాజు. సినిమాల పరంగా మొదటి నుంచి ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. ఎలాంటి కాంబినేషన్ అయినా ఇట్టే సెట్ చేయగల టాలీవుడ్ నిర్మాతలలో మొదటి స్థానంలో ఉంటారు ఆయన. భారీ చిత్రాలను లైన్ లో పెడుతూ ఒకేసారి అరడజనుకు పైగా చిత్రాలను సెట్స్ పైకి తీసుకెళ్ల గలిగే సత్తా ఉన్న నిర్మాత దిల్ రాజు అని చెప్పాలి. ఇటీవలే వకీల్ సాబ్ లాంటి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దిల్ రాజు తెలుగులో ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో రెడీగా ఉన్నాడు.
F3 రౌడీ బాయ్స్ వంటి చిత్రాలు చేస్తూ తెలుగులో బిజీ గా ఉండగా, హిందీలో పలు సినిమాలతో అక్కడ కూడా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు కాకుండా మరొక మూడు చిత్రాలను కూడా ఆయన ఈ నెలలో మొదలు పెట్టబోతున్నట్లూ తెలుస్తుంది. ఇవన్నీ కూడా పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. వినాయకచవితి సందర్భంగా ఆయన తన ప్రొడక్షన్ లో ఒక పెద్ద సినిమా స్టార్ట్ చేస్తూన్నట్లు తెలుస్తుంది. అదే రామ్ చరణ్ శంకర్ ల సినిమా. రేపు ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం ఘనంగా జరగనుంది.
టాలీవుడ్ లోని కొంతమంది సినీ ప్రముఖుల మధ్య ప్రారంభోత్సవం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. శంకర్ కి తెలుగులో మొదటి చిత్రం అందులోనూ రామ్ చరణ్ హీరో కావడంతో ఈ చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో. ఇక ఈ సినిమా ప్రారంభం అయినా నెల వ్యవధిలోనే మరొక భారీ చిత్రాన్ని మొదలు పెట్టనున్నాడు దిల్ రాజు. వంశీ పైడిపల్లి విజయ్ దళపతి కాంబో లో తెరకెక్కబోయే చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందట. ప్రస్తుతం చేస్తున్న బెస్ట్ సినిమా తర్వాత ఈ సినిమా చేయనున్నాడు విజయ్. ఇక అల్లు అర్జున్ హీరోగా రాబోయే ఐకాన్ చిత్రాన్ని కూడా వచ్చే నెలలోనే మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో ఏ నిర్మాత చేయని సాహసం చేస్తూ దిల్ రాజు నెంబర్ వన్ నిర్మాతగా కొనసాగుతున్నాడు.