రాంచరణ్, శంకర్ సినిమా టైటిల్ అదేనా...?
రామ్ చరణ్ సినిమా పనులు మొదలుపెట్టేశారట దర్శకుడు శంకర్. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్తున్నందున చరణ్ పై లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు, ఈ మెగా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా శంకర్ తెరకెక్కించనున్నారట. చరణ్ కి జంటగా కియారా అద్వానీ ఈ మూవీలో నటిస్తున్నారని సమాచారం. చరణ్ తో కియారాకు ఇది రెండవ సినిమా., త్వరలోనే శంకర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.
మరోవైపు ఈ ప్రాజెక్ట్ కథపై చిన్న వివాదం నడుస్తుందని తెలుస్తుంది. శంకర్ చరణ్ తో చేస్తున్న సినిమా కథ నాదే అంటూ తమిళ చిత్ర రచయిత చెల్లముత్తు సౌత్ రచయితల మండలిలో పిర్యాదు చేశారని సమాచారం. సౌత్ రచయితల సంఘం ఈ వివాదానికి పరిష్కారం చూపనుందట. ఇక ఈ మూవీ కథపై అప్పుడే అనేక కథనాలు చక్కర్లు కొట్టాయని సమాచారం. చరణ్ యంగ్ సీఎంగా కనిపించనున్నారనే పుకార్లు కూడా బాగా వినిపిస్తున్నాయట.
ఈ సినిమా షూటింగ్ బుధవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం కానుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర బృందం వైట్ టీ షర్ట్ లతో ఒక ఫొటో షూట్ కూడా చేసిందని సమాచారం.
ఈ క్రమంలోనే మూవీ టైటిల్ గురించి ఆసక్తికర టాక్ నడుస్తోందని సమాచారం.అదేంటంటే, ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని శంకర్ భావిస్తున్నారని తెలుస్తుంది. విశ్వంభర అంటే ధరిత్రి మరియు భూమి, నేల అని అర్థం వస్తుందట.ఒకవేళ ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే.. అదిరిపోతుందని తెలుస్తుంది.
ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్త వినిపిస్తుంది.ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్న 50వ చిత్రం కానుందని సమాచారం.అంతేకాదు, రామ్ చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా కాబోతోందట. ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీత బాణీలు సమకూర్చనున్నారని అందరికి తెలిసిన విషయమే. మరి శంకర్ మరో తెలుగులో మొదటి డైరెక్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి.