చరణ్ కోసం ట్రెండ్ సెట్టర్స్‌ని తీసుకొచ్చారా..??
ఈ ఫోటో షూట్ లో హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొన్నారు. అయితే ఈ షూట్‌తో పాటు ముహూర్త వేడుకలో పాల్గొనడం కోసం కియారా ముంబయి నుంచి వచ్చారు. కాగా.. శంకర్ ఏం చేసినా ఒక రేంజిలో ఉంటుందన్న సంగతి తెలిసిన విదితమే. అయితే ఈ ఫొటో షూట్ కూడా అంతే మరి. ఇక రెగ్యులర్ కెమెరామన్లతో కాకుండా స్పెషల్ టెక్నీషియన్లతో ఈ షూట్ చేయించారు. వారే రాజీవ్ చుదాసమా, అవినాష్ గోవారికర్..ఫిలిం ఫొటో షూట్లలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు.
అయితే మార్చింగ్ యాంట్స్ పేరుతో 13 ఏళ్ల కిందట ఓ సంస్థను నెలకొల్పన రాజీవ్ మోడలింగ్, ఫిలిం ఫొటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు తరచుగా అవినాష్‌తో ఫొటో షూట్లు చేయించుకుంటారు. ఇక ఈ మధ్య అవినాష్ చేసిన ఒక ఫొటో షూట్లో మహేష్ హాలీవుడ్ హీరోలాగా కనిపించారు. అయితే రాజీవ్ బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలకు పోస్టర్ డిజైన్ చేసిన ఘనత అతడి సొంతం.
ఇక సౌత్‌లో పెద్దగా పని చేయని రాజీవ్‌ను చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకొచ్చారు. అయితే ఫొటో షూట్లు, డిజైనింగ్ కోసం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ రాజీవ్, అవినాష్. ఔట్ పుట్ కూడా ఆ రేంజిలోనే ఇస్తుంటారు. ఇక శంకర్-చరణ్ సినిమా ఫొటో షూట్ విజువల్స్, పోస్టర్ల మీద భారీ అంచనాలే పెట్టుకోవచ్చునని అంటున్నారు. అలాగే అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చబోతున్నారు.