వైరల్ : బిగ్ బాస్ లోకి షణ్ముఖ్.. దీప్తి సునైనా రియాక్షన్?

praveen
ఇటీవలి కాలంలో యూట్యూబర్లు ఎంతగానో ఫేమస్ అవుతున్నారు. ఏకంగా సినీ సెలబ్రిటీల రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు.  అయితే ఇలా యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిన వారు అటు తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. మొదటి సీజన్ నుంచి ఇక ఇప్పుడు 5 సీజన్ వరకు కూడా ఇలా ఎంతోమంది యూట్యూబ్ లో ఫేమస్ అయిన వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారూ. ఈసారి..  యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్  బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.


 అయితే ప్రతి సీజన్ సమయంలో కూడా షణ్ముఖ్ జస్వంత్ ఇక బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే టాక్ వినిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ రెండవ సీజన్ లోనే షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునైనా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనదైన శైలిలో ఎన్నో రోజుల పాటు ప్రేక్షకులను అలరించింది దీప్తి సునైనా.  అంతేకాదు అప్పట్లో ఇక బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ పేరును పదేపదే దీప్తి సునైనా చెప్పడంతో..  షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ లో మరింత ఫేమస్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ నుండి  బయటకు వచ్చిన తర్వాత కూడా దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ లవ్ స్టోరీ అంతటా పాకిపోయింది.



 ఎక్కడ చూసినా కూడా వీరిద్దరూ కలిసి దర్శనమిచ్చారు.  ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి నటించక పోయినప్పటికీ వీరిద్దరి లవ్ స్టోరీ మాత్రం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం  షణ్ముఖ్ జస్వంత్ బిగ్బాస్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వగా దీప్తి సునైనా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కోరిక ఉంటుంది. ఇక దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చిన సమయంలో రియాక్షన్ ఎలా ఉంది అన్న విషయానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: