మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా.. కోపంతో షో నుంచి వెళ్లిపోయిన సుమా?

praveen
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాం బుల్లితెరపై ఎంత క్రేజ్ సంపాదించుకుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రస్తుతం ఈ టీవీ లో ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సాధారణంగానే యాంకర్ సుమ ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడి నెలకొంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక సుమ తన వాక్చాతుర్యంతో అటు క్యాష్ కార్యక్రమాన్ని కూడా ఎంతగానో సందడి సందడిగా మార్చేసింది. ప్రతివారం కూడా నలుగురు సరికొత్త గెస్టు లతో అటు క్యాష్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటుంది.


 ఇక ఈ వారం కూడా అందమైన భామలతో క్యాష్ ప్రోమో మొత్తం కళకళలాడి పోయింది అని చెప్పాలి. కొంతమంది జబర్దస్త్ నటీమణులతో పాటు కొంతమంది సీరియల్ నటి మణులను కూడా గెస్ట్ లుగా పిలిచింది యాంకర్ సుమ.  ఇక తనదైన శైలిలోనే డాన్సులు చేస్తూ  ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచింది. ఇక ఎప్పటి లాగానే ఇటీ వలే విడుదలైన క్యాష్ ప్రోమో సందడి సందడి గా మారిపోయింది అని చెప్పాలి.  కానీ ఈ ప్రోమో చివరిలో ఏకంగా సుమ ఒక్కసారిగా సీరియస్ అయి షో నుంచి వెళ్ళిపోయింది.



 ఇటీవలే విడుదలైన ప్రోమో జబర్దస్త్ లో నటీమణులు గా ఉన్న వర్ష రోహిణి మధ్య గొడవ జరిగింది. ఇక ఒకరిని ఒకరు దూషించడం లాంటివి కూడా చేస్తారు. ఏకంగా పర్సనల్ కామెంట్స్ కూడా చేసుకున్నారు. దీంతో సుమ ఒక్కసారిగా అవాక్కయ్యింది. ఇక వారు ఒకరి పై ఒకరు కామెంట్లు చేసుకోవడం చూసి ఒకరిపై ఒకరు కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారా అంటూ కోపంతో తన చేతిలో పట్టుకున్న కార్డు నేలకేసి కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళి పోయింది సుమ.  ఇక ఈ ప్రోమో చూసిన బుల్లితెర ప్రేక్షకులు అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: